దళారులను నమ్మొద్దు


Sun,October 20, 2019 11:58 PM

మెదక్ మున్సిపాలిటీ :రైతులు పండించిన పంటను నేరుగా వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలకే తరలించాలని, దళారులను నమ్మి రైతులు మోసపోవద్దని ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. ఆదివారం మెదక్ మార్కెట్ కమిటీ ఆవరణలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి ప్రారంభించారు. ఆ తర్వాత వరిధాన్యం బస్తాను తూకం వేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ రైతులు పండించిన పంటకు ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పిస్తుందన్నారు. రైతులు పండించిన పంటను నేరుగా కొనుగోలు కేంద్రాలకు తరలించాలని సూచించారు. సీఎం కేసీఆర్ రైతు సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతున్నారన్నారు. రైతులు దళారుల బారిన పడి మోసపోవద్దనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ వరి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారన్నారు.

జిల్లాలో 180 కొనుగోలు కేంద్రాలు..
జిల్లాలో 180 వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి తెలిపారు. ఇందులో ఐకేపీ ద్వారా 26 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరుగుతున్నదని, 154 కేంద్రాలను పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఏ గ్రేడ్ రకానికి రూ.1835 కాగా, సాధారణ రకానికి రూ.1815 మద్దతు ధర ఇవ్వడం జరుగుతున్నదని తెలిపారు.

కొనుగోలు కేంద్రాల వద్ద అన్ని సౌకర్యాలు కల్పించాలి..
జిల్లాలో ఏర్పాటు చేస్తున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని ఎమ్మెల్యే డీసీవోను ఆదేశించారు. రైతులకు కావలసినన్ని బస్తాలను ఏర్పాటు చేయాలని సూచించారు. అంతేకాకుండా తూకం వేసిన ధాన్యం బస్తాలను వెంటవెంటనే లారీల్లో రైస్‌మిల్లులకు పంపేలా చూడాలన్నారు. ఈ విషయంలో కలెక్టర్, జేసీలతో మాట్లాడుతానని చెప్పారు. కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ లావణ్యరెడ్డి, డీసీవో శంకర్, మార్కెట్ కమిటీ కార్యదర్శి నర్సింహులు, సూపర్‌వైజర్ ఈశ్వరయ్య, పీఏసీఎస్ చైర్మన్ హన్మంతరెడ్డి, సీఈవో సాయి కిరణ్, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షులు సోములు, మున్సిపల్ మాజీ చైర్మన్ తొడుపునూరి చంద్రపాల్, మాజీ వైస్ చైర్మన్ రాగి అశోక్, ఏవో ప్రవీణ్, ఏఈవో శేఖర్, టీఆర్‌ఎస్ నాయకులు అంజాగౌడ్, కిష్టయ్య, శ్రీనివాస్‌రెడ్డి, జయరాంరెడ్డి, తొడుపునూరి శివరామకృష్ణ, మాజీ కౌన్సిలర్ మల్లేశం, టీఆర్‌ఎస్ నాయకులు సాప సాయిలు, రైతులు పాల్గొన్నారు.

46
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...