టీఆర్‌ఎస్‌తోనే గ్రామాలాభివృద్ధి


Sun,October 20, 2019 11:58 PM

మనోహరాబాద్ : టీఆర్‌ఎస్ పార్టీతోనే గ్రామాలాభివృద్ధి సాధ్యమని జెడ్పీ చైర్ పర్సన్ హేమలతాశేఖర్‌గౌడ్ అన్నారు. మనోహరాబాద్ మండలంలో జెడ్పీ చైర్ పర్సన్ దత్తత గ్రామమైన గౌతోజిగూడెంలో ఆదివారం ఇంకుడు గుంతల పనులను ప్రారంభించారు. అదే విధంగా కిచెన్ గార్డెన్ విత్తనాలను ఇంటింటికీ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాతనే గ్రామాల ప్రగతి పథంలో దూసుకెళ్తున్నాయన్నారు. నేడు పట్టణాలను తలదన్నే విధంగా గ్రామాలు, మారుమూల పల్లెలు మారాయన్నారు. గ్రామంలో పరిశుభ్రత మొదలవ్వాలంటే ముందుగా మురికి, చెత్తాచెదారం లేకుండా చేయాలన్నారు. ప్రతి ఇంటికీ ఇంకుడు గుంతలను ఏర్పాటు చేసుకోవడం వల్ల ఇది సాధ్యపడుతుందన్నారు. అదేవిధంగా మార్కెట్‌కు వెళ్లే అవసరం లేకుండా ఇంటి పరిసరాల్లోనే కూరగాయల మొక్కలను పెంచుకోవాలని సూచించారు. దీనికి వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో కిచెన్ గార్డెన్ పథకం ద్వారా ప్రతి ఇంటికీ ఉచితంగా సోరకాయ, చిక్కుడు, కాకర, తోటకూర విత్తనాలను పంపిణీ చేస్తున్నామన్నారు.

గ్రామమైన గౌతోజిగూడెంను జిల్లాలోనే ఆదర్శ గ్రామంగా మార్చుకుందామని పిలుపునిచ్చారు. మరికొద్ది రోజుల్లోనే సీసీరోడ్లు, అంగన్‌వాడీ భవనానికి నిధులు మంజూరు అయ్యేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు శేఖర్‌గౌడ్, ఎంపీపీ పురం నవనీతరవి ముదిరాజ్, వైస్ ఎంపీపీ విఠల్‌రెడ్డి, ఎంపీడీవో జైపాల్‌రెడ్డి, ఏవో రాజేశేఖర్, ఏఈవో సచిన్, సర్పంచ్ వెంకటేశ్వర్లు, ఉప సర్పంచ్ రేణుకుమార్, రైతు సమన్వయ సమితి గ్రామ కో-ఆర్డినేటర్ నాగిరెడ్డి, యూత్ నాయకుడు రమేశ్‌గౌడ్, మాజీ ఎంపీటీసీ కృష్ణగౌడ్, శ్రీరామ్ గ్రామస్తులు పాల్గొన్నారు.

66
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...