కొనసాగుతున్న యోగా పోటీలు


Sun,October 20, 2019 03:10 AM

సిద్దిపేట ఎడ్యుకేషన్: సిద్దిపేటలో రాష్ట్రస్థాయి యోగా పోటీలు కొనసాగుతున్నాయి. శనివారం రెండవ రోజు అండర్-17, -14 బాలబాలికలకు స్థానిక టీటీసీ భవన్, బాబు జగ్జీవన్ రావు భవన్‌లో పోటీలు నిర్వహించారు. ఆర్టిస్టిక్ యోగా, రిథమిక్ యోగా పోటీల్లో క్రీడాకారులు తమ విన్యాసాలతో ఆకట్టుకున్నారు. అండర్- 17 పోటీల రాష్ట్ర పరిశీలకులు ఇమ్రాన్, అండర్- 14 పోటీల రాష్ట్ర పరిశీలకులు కమలాకర్, సిద్దిపేట జిల్లా యోగా కో-ఆర్డినేటర్, తోట సతీశ్, వ్యాయామ ఉపాధ్యాయులు రామేశ్వర్‌రెడ్డి, హరికిషన్, రాంనర్సయ్య, అశోక్, రాజ్ మోహన్, లక్ష్మన్, భవాని, రజిత తదితరులు ఉన్నారు.

గెలుపొందిన విజేతలు
శనివారం నిర్వహించిన పోటీల్లో అండర్-17 బాలికల విభాగంలో ప్రథమ స్థానం మెదక్ జిల్లా, ద్వితీయ స్థానం నిజామాబాద్, తృతీయ స్థానం రంగారెడ్డి జిల్లా క్రీడాకారులు నిలిచారు. అండర్-14 బాలికల విభాగంలో మొదటి స్థానం మెదక్ కైవసం చేసుకోగా, రెండవ స్థానం వరంగల్, మూడవ స్థానం అదిలాబాద్ క్రీడాకారులు విజయం సాధించారు. ఇక అండర్-17 బాలుర విభాగంలో ప్రథమ స్థానం కరీంనగర్ కైవసం చేసుకోగా, రెండవ స్థానం హైదరాబాద్, మూడవ స్థానం రంగారెడ్డి నిలిచాయి. అండర్-14 బాలుర విభాగంలో ప్రథమ స్థానం రంగారెడ్డి, ద్వితీయ స్థానం కరీంనగర్, తృతీయ స్థానం వరంగల్ క్రీడాకారులు విజయం సాధించారు.

పోటీల్లో ఆటవిడుపు
రాష్ట్రస్థాయి యోగా పోటీలకు వివిధ జిల్లాల నుంచి వచ్చిన క్రీడాకారులు సిద్దిపేటలోని కోమటి చెరువును సందర్శించారు. రాష్ట్రస్థాయి యోగా పోటీలకు జడ్జీలుగా వ్యవహరించే బృందం రంగనాయక సాగర్‌ను సందర్శించారు.

65
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...