రైట్.. రైట్


Fri,October 18, 2019 11:35 PM

-జిల్లాలో తిరుగుతున్న 90శాతం బస్సులు
-రోజు రోజు పెరుగుతున్న బస్సుల సంఖ్య
-సోమవారం నుంచి తిరుపతి, కాకినాడ, విజయవాడ, శ్రీశైలం బస్సులు పునరుద్ధరణ
- డిపో ను పర్యవేక్షించిన ఆర్డీవో
-శుక్రవారం తిరిగిన 85 బస్సులు

మెదక్ అర్బన్ :జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు 90 శాతం యథావిధిగా తిరుగుతున్నాయి. సమ్మెకంటే ముందుగా ఏ విధంగా అయితే బస్సులు నడిచాయో అదే విధంగా బస్సులు నడుస్తున్నాయి. ఆర్టీసీ అధికారులు, రెవెన్యూ అధికారులు, డీటీవోల సమన్వయంతో జిల్లాలో 90శాతం బస్సులు తిరుగుతూ ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేరవేస్తున్నారు. సమ్మె మొదటి రెండు రోజుల్లో 60 శాతం బస్సులు నడిచినప్పటికీ తరువాత ఆర్టీసీ అధికారుల ప్రత్యామ్నాయ ఏర్పాట్లతో 90శాతం బస్సులు యథావిధిగా తిరుగుతున్నాయి. మరో రెండు రోజుల్లో 100 శాతం బస్సులను నడిపించడానికి అన్ని ఏర్పాట్లను చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. మెదక్ డిపోలో ఆర్టీసీ సంస్థకు చెందిన 60 బస్సులు ఉండగా 49 బస్సులతో పాటు 36 అద్దె బస్సులతో కలిపి మొత్తం 85 బస్సులు వివిధ రూట్లలో యథావిధిగా తిరిగాయి. శుక్రవారం మెదక్ బస్సుడిపో నుంచి మెదక్, చేగుంట, తుప్రాన్ మీదుగా సికింద్రాబాద్ వరకు, కొల్చారం, రంగంపేట సంగారెడ్డి మీదుగా పటాన్‌చెరువు వరకు, మెదక్, నర్సాపూర్ నుంచి ఎంజీబీఎస్ వరకు బస్సులను యథావిధిగా తిరిగాయి.

ఎల్లారెడ్డి, బాన్సువాడ మీదుగా బోధన్ వరకు, రామాయంపేట మీదుగా సిద్దిపేట వరకు అన్ని రూట్లల్లో బస్సులు నడిచాయి. అధికారులు మారుమూల గ్రామలకు సైతం పల్లెవెలుగు బస్సులను నడిపించి ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేస్తున్నారు. సోమవారం మెదక్ డిపో నుంచి తిరుపతి, విజయవాడ, శ్రీశైలం, కాకినాడ బస్సులను యథావిధిగా నడిపించడం జరుగుతుందని డిపో అధికారులు తెలిపారు. దీంతో 14వ రోజు జిల్లాలో ఆర్టీసీ కార్మికుల సమ్మె ప్రభావం పెద్దగా కన్పించలేదు. శుక్రవారం మెదక్ డిపోను మెదక్ ఆర్డీవో సాయిరాం పర్యవేక్షించి బస్సులు నడిచే రూట్ల వివిరాలను డీఎం జాకీర్ హుస్సేన్‌ను అడిగి తెలుసుకున్నారు. 100శాతం బస్సులను నడిచేలా చర్యలు తీసుకోవాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. తాత్కాలిక డ్రైవర్లకు బస్సులను అప్పగించే ముందు బ్రీత్ అనలైజ్ చేసి బస్సులను అప్పగించాలని తెలిపారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో మెదక్ డిపో వద్ద సీఐ వెంకటేశం ఆధ్వర్యంలో బందోబస్తు చర్యలు నిర్వహించడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగలేదు.

రోజురోజుకూ పెరుగుతున్న బస్సుల సంఖ్య..
ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో ముందస్తు చర్యగా ఆర్టీసీ అధికారులు, డీటీవో సమన్వయంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి తాత్కాలిక డ్రైవర్లను, కండక్టర్లను నియమించి రోజు రోజుకు వివిధ రూట్లలో బస్సుల సంఖ్యను పెంచుతున్నారు. దీంతో యథావిధిగా వివిధ ప్రాంతాలకు బస్సులను షెడ్యూల్ ప్రకారం నడిపిస్తున్నారు. దీంతో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా వారి వారి గమ్యస్థానాలకు సురక్షితంగా చేరుతున్నారు.

జిల్లాలో కన్పించని ఆర్టీసీ కార్మికుల సమ్మె ప్రభావం..
జిల్లాలో 14వ రోజు కూడా అన్ని రూట్లల్లో బస్సులు యథావిధిగా తిరుగుతుండటంతో శుక్రవారం మెదక్ డిపో ఆర్టీసీ కార్మికుల సమ్మె ప్రభావం పెద్దగా కన్పించలేదు. ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేర్చడం కోసం అధికారులు ఎప్పటికప్పుడూ చర్యలు తీసుకుంటున్నారు. మెదక్ నుంచి సంగారెడ్డి, పటాన్‌చెరువు వరకు ఆర్టీసీ బస్సు డిపో బస్సులు తిరిగాయి. హైదరాబాద్, మెదక్, చేగుంట, తూప్రాన్, ఎల్లారెడ్డి, బాన్స్‌వాడ, బోధన్ రూట్లతో మెదక్ డిపో బస్సులు తిరిగాయి. దీంతో ఆర్టీసీ కార్మికల సమ్మె ప్రభావం పెద్దగా కన్పించలేదు.

95
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...