మానసిక వికలాంగులకు వరం పునరావాస కేంద్రం


Fri,October 18, 2019 10:42 PM

నర్సాపూర్,నమస్తేతెలంగాణ: మానసిక వికలాంగులలో పరివర్తన కలిగించడానికి ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రం మానసికవికలాంగుల పాలిట వరంగా మారింది. పుట్టినప్పటినుంచి బుద్దిమాద్యంతో పాటు శారీరలోపం ఉన్న పిల్లలకు ఇందులో ఫిజియోథెరపి ద్వారా చక్కటి చికిత్సలు చేస్తున్నారు. సుమారు 100కుపైగా ఉన్న ఆటవస్తువుల ద్వారా వారిలో మార్పును తెవడానికి కృషి చేస్తున్నారు. ప్రభుత్వం గ్రామీణ ప్రాంతంలో ఉన్న మానసిక వికలాంగులకు చికిత్సలు, కౌన్సెలింగ్‌ల ద్వారా పరివర్తన తేవడానికి ఇద్దరు డాక్టర్‌లను ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది. వీరు 15 రో జులకు ఒకసారి కేంద్రాలకు వచ్చి పిల్లలకు ఫిజియోథెరపి పరీక్షలను నిర్వహిస్తున్నారు. బుద్దిమాంద్యం గల పిల్లలకు విద్యాబుద్దులతో పాటు తన సొంత పనులను చేసుకోవడంపై అవగాహన కల్పిస్తున్నారు. నర్సాపూర్ పట్టణంలోని పాత ఐకేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రం సత్పలితాలను ఇస్తుంది.

60
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...