హోటల్ యజమానికి జరిమానా


Fri,October 18, 2019 10:42 PM

పాపన్నపేట: మండల కేంద్రమైన పాపన్నపేటలోని సుభాష్‌చంద్రబోస్ విగ్రహం సమీపాన హోటల్ నిర్వహిస్తున్న ఒక వ్యక్తి ఇష్టానుసారంగా రోడ్డుపై టీ కప్పులు ప్లాస్టిక్ వ్యర్థాలు పారవేస్తుండటంతో అతడికి శుక్రవారం రూ.500 జరిమానా విధించినట్లు పాపన్నపేట మండల పంచాయతీ అధికారి లక్ష్మీకాంత్‌రెడ్డి వెల్లడించారు. ఈ మేరకు నాలుగు, ఐదు సార్లు అలా చేయవద్దని చెప్పడమే కాకుండా నోటీసులు కూడా జారీ చేసిన పట్టించుకొలేదని దీంతో జరిమానా విధించినట్లు ఆయన తెలిపారు. మళ్లీ ఇలాంటి చర్యలకు పాల్పడితే హోటల్ సీజ్ చేస్తామని హెచ్చరించినట్లు ఆయన వివరించారు. పాపన్నపేట రోడ్డునుంచి గ్రామంలోకి వేళ్లే మార్గంలో చిన్న చిన్న దాబ్బాలు ఏర్పాటు చేసుకుని దుకాణాలు నిర్వహిస్తున్నారని వాటిని కూడా తొలగించాల్సిందిగా సూచించారు. త్వరలో గ్రామంలో రోడ్డు విస్తరించనున్నందున దాబ్బాలు తొలగించాల్సిందిగా ఆదేశించామని 15 రోజులలోగా తొలగించాలిని నోటీసులు కూడా ఇవ్వనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రాణి, స్థానిక సర్పంచ్ గురుమూర్తిగౌడ్, కో ఆప్షన్ సభ్యుడు గౌస్ ఉన్నారు.

56
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...