తల్లిబిడ్డల సంక్షేమానికి పెద్దపీట


Fri,October 18, 2019 10:42 PM

మనోహరాబాద్: తల్లిబిడ్డల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని రాష్ట్ర సర్పంచుల ఫోరం వర్కింగ్ ప్రెసిడెంట్ చిట్కుల మహిపాల్‌రెడ్డి అన్నారు. మనోహరాబాద్ మండల కేంద్రంలో జరిగిన తల్లిపాల వారోత్సవాలు, ఆరోగ్యలక్ష్మి కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తల్లి గర్భం పొందినప్పటి నుంచి బిడ్డ ఎదిగే వరకు అవసరమయ్యే సకల సౌకర్యాల పథకాలను సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టారన్నారు. ప్రతి మండల కేంద్రంలో కార్పొరేట్ స్థాయిలో ప్రభుత్వ దవాఖానలు ఏర్పాటు చేశారన్నారు. అదే విధంగా ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవం జరిగితే కూతురు పుడితే రూ. 14 వేలు, కొడుకు పుడితే రూ.13 వేలతో పాటు కేసీఆర్ కిట్‌లను ఉచితంగా అందజేస్తారన్నారు. అంగన్‌వాడీల్లో బాలామృతంతో పాటు పౌష్టికాహారం అందజేస్తారన్నారు. పుట్టిన బిడ్డకు కనీసం ఆరు నెలల వరకు తల్లి పాలు తప్పనిసరిగా ఇవ్వాలన్నారు. తల్లిపాలల్లోని పౌష్టిక విలువలు, తల్లులు తీసుకునే పౌష్టికాహారంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో తల్లులు, గర్భిణులు పాల్గొన్నారు.

64
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...