తహసీల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన జేసీ


Fri,October 18, 2019 10:42 PM

కౌడిపల్లి: కౌడిపల్లి తహసీల్దార్ కార్యాలయాన్ని శుక్రవారం సాయంత్రం మెదక్ జాయింట్ కలెక్టర్ నగేశ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జేసీ నగేశ్ విలేకరులతో మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న పార్ట్-బీ సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేక చొరవ తీసుకోవడం జరుగుతుందన్నారు. సమస్యాత్మకంగా ఉన్న భూ సమస్యలపై రెవెన్యూ అధికారులు ప్రత్యేక చొరవ తీసుకుని పరిష్కరించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. అలాగే కౌడిపల్లి మండలంలో రెవెన్యూ సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేవిధంగా తహసీల్దార్ ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్ విజయలక్ష్మి పాల్గొన్నారు.

74
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...