దరఖాస్తుల ఆహ్వానం


Fri,October 18, 2019 10:41 PM

మెదక్ కలెక్టరేట్: జిల్లాలోని యువకులు, విద్యార్థులు, ఉద్యోగార్థులు కేంద్ర పారిశ్రామిక భద్రత దళం (సీఐఎస్‌ఎస్) భారత హోం మంత్రిత్వ శాఖలో కానిస్టేబుల్/ట్రేడ్స్ మ్యాన్ (కుక్, కోబ్లర్, బార్బర్, వాషర్-మ్యాన్, కార్పెంటర్, స్వీపర్, పేయింటర్, మసోష్, ప్లంబర్, మాలి, ఎలక్టీషియన్) పోస్టులకు అర్హులైన అభ్యర్థులు నెల 22వ తేదీ సాయంత్రం 5గంటలలోపు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి బి.జయరాజు ఒక ప్రకటనలో తెలిపారు. మొత్తం 914 ఉద్యోగాల భర్తీకి ప్రకటన జారీ అయినట్లు తెలిపారు. ఈ ఉద్యోగాలకు 10వ తరగతి ఉత్తీర్ణులై 18 నుంచి 23 సంవత్సరాలలోపు మధ్యగల పురుష అభ్యర్థులు అర్హులు అని తెలిపారు.

రాత పరీక్ష, సంబంధిత విభాగాల్లో స్కిల్ టెస్టు ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. ఒక అభ్యర్థి ఒక ఉద్యోగానికి మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని డైరెక్టర్ జనరల్ కేంద్ర పారిశ్రామిక భద్రత దళం, డైరెక్టర్ యువజన సర్వీసుల శాఖ, హైదరాబాద్ వారు తెలియజేసినట్లు తెలిపారు. ఈ ఉద్యోగాలకు ఏమైనా సందేహాలు ఉంటే ఆన్‌లైన్‌లో cisfrectt.in వెబ్‌సైట్‌ను చూడాలని తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఒక ప్రకటనలో తెలిపారు.

68
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...