పారిశుద్ధ్య సమస్యలపై దృష్టి సారించాలి


Thu,October 17, 2019 12:24 AM

మెదక్ కలెక్టరేట్: జిల్లాలోని గ్రామాల్లో నెలకొన్న శానిటేషన్ సమస్యలపై ఆయా మండలాల వైద్యాధికారులు దృష్టి సారించాలని కలెక్టర్ ధర్మారెడ్డి అన్నారు. బుధవారం సాయంత్రం కలెక్టరేట్‌లోని ప్రజావాణి హాల్‌లో జరిగిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలోని నాగ్సాన్‌పల్లి, అనంతసాగర్ గ్రామాల్లో శానిటేషన్ కార్యక్రమాలపై వైద్యాధికారులు దృష్టి సారించాలన్నారు. కేసీఆర్ కిట్‌లు ఎక్కువగా పెండింగ్ ఉన్న జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలైన తూప్రాన్, శివ్వంపేట, టేక్మాల్, కౌడిపల్లి కి చెందిన సిబ్బందిని కేసీఆర్ కిట్‌లు ఎక్కువగా పెండింగ్‌లో ఉండడానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. వీలైంత త్వరగా కేసీఆర్‌కిట్‌ల పెండింగ్ క్లియర్ చేయాలన్నారు.

30 రోజుల ప్రణాళిక పూర్తి కాని గ్రామాల్లో వారం రోజులు ఎక్కువ గడువు పొడిగించి పూర్తి చేయాలని ఆదేశించారు. కేసీఆర్ కిట్‌కు సంబంధించి పోర్టల్‌కు డాటా ఓపెన్ చేసి వివరాలు చూడాలని, ఏమైనా పెండింగ్ ఉంటే ఈ నెల చివరి వరకు పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా వైద్యాధికారి డా.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ వైద్యాధికారులు స్థానికంగా జరిగే సమస్యలను వీలైంత త్వరగా పరిష్కరించాలన్నారు. ఎన్‌సీడీకి సంబంధించిన కార్యక్రమాలపై సమీక్ష చేయడం జరిగింది. కార్యక్రమంలో డీఐవో డా.సుమిత్రారాణి, డా. రాజు, అడిషనల్ డీఎంహెచ్‌వోలు డా.ఇర్షద్, డా. నవీన్, డా.అనీల, డా.విజయనిర్మల, డా.అరుణశ్రీ, సీనియర్ డీపీఎం జగన్నాథ రెడ్డి, వివిధ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు చెందిన వైద్యాధికారులు, సూపర్‌వైజర్లు ఏఎన్‌ఎంలు పాల్గొన్నారు.

77
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...