క్రీడాకారులకు ప్రోత్సాహం అందిస్తా


Wed,October 16, 2019 12:28 AM

నారాయణఖేడ్, నమస్తే తెలంగాణ: క్రీడాకారులకు అవసరమైన ప్రోత్సాహం అందించే దిశగా కృషి చేస్తానని ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్‌రెడ్డి అన్నారు. నారాయణఖేడ్‌లోని తాసిల్ గ్రౌండ్‌లో మూడు రోజులుగా సాగిన ఎంబీఆర్ క్రికెట్ టోర్నీ ముగింపు సందర్భంగా సోమవారం రాత్రి విజేతలకు బహుమతులను ప్రదానం చేసిన సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. నారాయణఖేడ్ ప్రాంతంలో ఎంతో మంది ప్రతిభ గల క్రీడాకారులు ఉన్నారని, వారికి తగిన ప్రోత్సాహం లభిస్తే జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో రాణించ గల్గుతారన్నారు. యువతకు క్రీడలపై ఆసక్తి కలిగే విధంగా మాజీ ఎంపీటీసీ సయ్యద్ ముజమ్మిల్ అంతర్జాతీయ హంగులతో నైట్ సర్కిల్ క్రికెట్ టోర్నీని నిర్వహించడం అభినందనీయమని కొనియాడారు. గత సంవత్సరం నుంచి నైట్ సర్కిల్ క్రికెట్ టోర్నీని నిర్వహిస్తున్న సయ్యద్ ముజమ్మిల్ జిల్లాలోని క్రీడాకారులకు నైట్ సర్కిల్ క్రికెట్‌ను పరిచయం చేసిన ఘనతను సొంతం చేసుకున్నారన్నారు. తనపై ఉన్న అభిమానంతో తన పేర క్రికెట్ టోర్నీని నిర్వహిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. టోర్నీలో ప్రథమ విజేతగా నిలిచిన పిట్లం జట్టుకు రూ.11,111ల నగదు బహుమతి, రెండవ స్థానాన్ని దక్కించుకున్న నారాయణఖేడ్ పాండురాక్ జట్టుకు రూ.5,555ల నగదు బహుమతితో పాటు ట్రోఫీలను ఎమ్మెల్యే చేతుల మీదుగా అందజేశారు. కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి జిల్లా కోఆర్డినేటర్ వెంకట్రామ్‌రెడ్డి, కల్హేర్ జడ్పీటీసీ నర్సింహారెడ్డి, ఏఎంసీ వైస్ చైర్మన్ ఎం.ఏ.బాసిత్, మా జీ సర్పంచ్ ఎం.ఏ.నజీబ్, నాయకులు బాబుఖాన్ తదితరులు పాల్గొన్నారు.

అలరించిన టోర్నీ
మూడురోజుల పాటు కొనసాగిన ఎంబీఆర్ నైట్ సర్కిల్ క్రికెట్ టోర్నీ క్రీడాకారులను, క్రీడాభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. అరుదుగా రాత్రి వేళ హైమాస్ట్ లైట్ల వెలుతురులో జరిగిన పోటీలు చూపరులను కనువిందు చేశాయి. ఈ సారి బౌండరీలైన్‌ను లైటింగ్ కేబుల్‌తో ముస్తాబు చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఒక్కో జట్టులో ఏడుగురు సభ్యులు, ఏడు ఓవర్ల మ్యాచ్‌లతో పాటు పలు ప్రత్యేకమైన నిబంధనలతో నైట్ సర్కిల్ క్రికెట్ టోర్నీని నిర్వహించారు.

52
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...