ఆదర్శ గ్రామంగా అంతారం


Wed,October 16, 2019 12:28 AM

చిలిపిచెడ్: తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన 30 రోజుల ప్రణాళిక చరిత్రలో నిలిచిపోనుంది. గ్రామీణ ప్రజలను వెంటాడిన దీర్ఘకాలిక సమస్యలకు ఈ కార్యక్రమం చరమగీతం పాడుతుంది. ఊరూర ప్రమాదకరంగా ఉన్న పాడుబడిన బావుల పూడ్చివేత,శిథిలమైన ఇండ్లు కూల్చివేత పనులు యుద్ధప్రాతిపదికన కొనసాగుతున్నాయి. గ్రామంలో పనిచేయని బోర్లను సైతం 30 రోజుల ప్రణాళికలో పూడ్చివేస్తున్నారు. గ్రామంలో ఇలా ఒకటి రెండు కాదు. అనేక దీర్ఘకాలిక సమస్యలను పల్లెప్రగతి కార్యక్రమం తరిమికొడుతుంది. ప్రజల భాగస్వామ్యంతో ప్రభుత్వ అధికారులు పరిశుభ్రత కోసం గ్రామాలను అభివృద్ధి చేస్తున్నారు. మండల పరిధిలోని అంతారం గ్రామంలో పల్లెప్రగతి కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అశోక్‌గౌడ్, ఉప సర్పంచ్ నరహరి, గ్రామ కార్యదర్శి, గ్రామ ప్రత్యేకఅధికారి, ఎంపీడీవో నర్సింహారెడ్డి, గ్రామ కో-అప్షన్ సభ్యులు,స్టాండింగ్ కమిటి సభ్యులు,వార్డు సభ్యులు, గ్రామస్తులు ముందుకు వచ్చి గ్రామ పరిశుభ్రతకు పాటుపడుతున్నారు. దీంతో గ్రామంలో అధికారులు, నాయకులు, గ్రామస్తులు 30 రోజుల ప్రణాళికల తయారీలో నిమగ్నమయ్యారు. గ్రామంలో శిథిలావస్థలో ఉన్న ఇండ్ల గుర్తించి కూల్చివేశారు. ప్రమాదకర బావులను గుర్తించి, వాటిని మట్టితో పూడ్చాచారు. కరెంట్ స్తంభాలను కొత్తవి ఏర్పాటు చేశారు. అలాగే గ్రామంలో వేలాడుతున్న వి ద్యుత్ తీగలను సరిచేశారు. గ్రా మంలో ఉన్న ప్రధాన రోడ్లకు ఇరువైపులా కలుపు మొక్కలను తొలగించి. మొక్కలను నాటారు.నాటిన మొ క్కకు గ్రామ పంచాయతీ నిధులతో ట్రీగార్డు ఏర్పాటు చేశారు.

జిల్లాలో ఉత్తమ అవార్డు సాధించింది
అంతారం గ్రామం జిల్లాలోని ఉత్తమ అవార్డు సాధించి, ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలని లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని గ్రామ సర్పంచ్ అశోక్ గౌడ్ తెలిపా రు. ప్రతి ఆదివారం గ్రామస్తులు,యువకుల స్వచ్ఛభారత్ నిర్వహిస్తున్నామన్నా రు. గ్రామంలో 30 రో జుల ప్రణాళికలో భాగం గా కలెక్టర్, డీపీవో, పీఆర్‌డీవో అధికారులు గ్రామాన్ని సందర్శించి,గ్రామంలోని పలు అభివృద్ధి పనుల గురించి తెలిపారు.

88
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...