భూసేకరణకు సహకరించండి


Tue,September 17, 2019 11:37 PM

ములుగు: ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కొండపోచమ్మ ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో భాగంగా నిర్మిస్తున్న కాలువల కోసం భూనిర్వాసితులు సహకరించాలని గజ్వేల్ ఆర్డీవో విజయేందర్‌రెడ్డి కోరారు. మంగళవారం ములుగు మండల పరిధిలోని లక్ష్మక్కపల్లి, శ్రీరాంపూర్, దాసర్లపల్లి, ములుగు, తదితర గ్రామాలలో భూనిర్వాసితులను కలిసి గ్రామసభను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొండపోచమ్మ ప్రాజెక్టు నుంచి సంగారెడ్డి జిల్లాలోని మంజీర ప్రాజెక్టుకు అనుసంధానం చేస్తూ నీటి కాలువను నిర్మించేందుకు ప్రభుత్వం భూసేకరణకు ఆదేశించిందని తెలిపారు. బీడుభూములను సస్యశ్యామలం చేసేందుకు చేస్తున్న ఈ భూసేకరణకు రైతులు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో తహసీల్దార్ విజయ్‌కుమార్, ఎంపీడీవో వెంకటేశ్వర్‌రెడ్డి, వంటిమామిడి ఏఎంసీ మాజీ చైర్మన్ జహంగీర్, ములుగు మండల అభివృద్ధి కమిటీ చైర్మన్ బట్టు అంజిరెడ్డి, టీఆర్‌ఎస్ పార్టీ స్టేట్ యూత్ వింగ్ అధ్యక్షుడు జుబేర్‌పాషా, టీఆర్‌ఎస్ నాయకుడు పెద్దబాల్ అంజన్‌గౌడ్, సర్పంచులు బట్టు మాధవి-అంజిరెడ్డి, బాలనర్సింలు, లలిత-మల్లేశ్, ఎంపీటీసీల ఫోరం మండల ఉపాధ్యక్షుడు హరిబాబు,గ్రామస్తులు పాల్గొన్నారు.

ప్రణాళిక పనుల పరిశీలన
మండల కేంద్రం ములుగుతో పాటు పలు గ్రామాలలో మంగళవారం గజ్వేల్ ఆర్డీవో విజయేందర్‌రెడ్డి 30 రోజుల ప్రణాళిక పనులను పరిశీలించారు. పారిశుధ్య పనులతో పాటు పాత ఇండ్లను తొలగించి గ్రామాలకు కొత్త రూపును అందిస్తున్నారని అన్నారు.

70
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...