భూ రాబంధులపై చర్యలు తీసుకోవాలి


Tue,September 17, 2019 02:06 AM

మెదక్ మున్సిపాలిటీ :పాపన్నపేట మండలం పొడ్చన్‌పల్లి గ్రామంలోని అసైన్డ్ భూములను కాజేసిన భూ రాబంధువులపై చర్యలు తీసుకోవాలని పొడ్చన్‌పల్లి గ్రామ దళితులు సోమవారం ప్రజావాణిలో జాయింట్ కలెక్టర్ నగేశ్‌కు ఫిర్యాదు చేశారు. సర్వే నంబర్ 1168/29లోని చాలా వరకు భూమిని స్థానికేతరులైన కొంతమంది కబ్జా చేశారని ఆరోపించారు. ఈ విషయమై కొన్ని రోజులుగా పోరాటం చేస్తున్నాం కానీ సంబంధిత అధికారులు ఎందుకు జాప్యం చేస్తున్నారో అర్థం కావడం లేదని వాపోతున్నారు. ఇప్పటికే ఈ విషయమై పలుమార్లు కలెక్టర్, ఆర్డీవో, ఇతర ప్రజాప్రతినిధుల దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగిందన్నారు. ఇదిలావుండగా అసైన్డ్ భూములకు సంబంధించి సమగ్ర విచారణ చేపట్టాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేసినా స్థానిక తహసీల్దార్ ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు చేపట్టడం లేదన్నారు. సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని జాయింట్ కలెక్టర్‌కు సమర్పించారు. వెంటనే జాయింట్ కలెక్టర్ స్పందించి మాట్లాడుతూ విచారణ చేపట్టి మీకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. వినతి ప్రతం ఇచ్చిన వారు తుడుం భూమన్న, పద్మారావు, దేవయ్య, భర్న, సత్తయ్య, ప్రభాకర్ తదితరులు ఉన్నారు.

71
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...