ఉమ్మడి మెదక్ జిల్లా.. టేబుల్ టెన్నిస్ జట్ల ఎంపిక


Tue,September 17, 2019 02:06 AM

కలెక్టరేట్, నమస్తే తెలంగాణ : స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆ ధ్వర్యంలో ఉమ్మడి మెదక్ జిల్లా టేబుల్ టెన్నిస్ జట్టు ఎంపిక పోటీలను స్థానిక సిటిజన్ క్లబ్‌లో నిర్వహించినట్లు ఎస్‌జీఎఫ్ సెక్రటరీ భిక్షపతి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి అండర్ - 14, 17 బాల బాలికల వి భాగంలో ఎంపికలకు 75 మంది క్రీడాకారులు హాజరయ్యారన్నారు. ఇందులో అండర్ -14 బాలుర విభాగంలో భాగ్య మోరబ్యా (కొల్లూరు సంగారెడ్డి), ఎస్. ప్రణీత్, కె.లక్ష్మణ్ (ఎంజేపీ నారాయణరావుపేట), పి. రామకృష్ణ (జడ్పీహెచ్‌ఎస్ మిరుదొడ్డి), జి. వేణుగోపాల్ (జడ్పీహెచ్‌ఎస్ కూచన్‌పల్లి మెదక్), అండర్ -17 బా లుర విభాగంలో జి.అర్ణిత్ (గీతా జూనియర్ కళాశాల మెదక్) జి.రవితేజ (ప్రభుత్వ జూనియర్ కళాశాల మెదక్), సతీశ్‌చరణ్‌గౌడ్, ఇ.రాజు, జి.హనీశ్ (జడ్పీహెచ్‌ఎస్ కూచన్‌పల్లి మెదక్), స్టాండ్‌బైగా చంద్రకిషోర్, అండర్ -14 బాలికల విభాగంలో ప్రిశాదిష్కల్ (గార్డియన్ స్కూల్ సంగారెడ్డి), క్రితిమేడ (సంగారెడ్డి), శోభ (జడ్పీహెచ్‌ఎస్ రెడ్డిపల్లి మెదక్), పి.స్నేహలత, భూమిక (జడ్పీహెచ్‌ఎస్ మిరుదొడ్డి సిద్దిపేట), స్టాండ్‌బైగా రమ్య (సిద్దిపేట), అండర్ -17 బాలికల విభాగంలో ఎన్. స్నేహలత (జడ్పీహెచ్‌ఎస్ మిరుదొడ్డి సిద్దిపేట), కె. మౌనిక (సిద్దిపేట), ఆర్.అక్షయ (సిద్దిపేట), ఎస్.శ్రీలత (జడ్పీహెచ్‌ఎస్ కుకునూరుపల్లి సిద్దిపేట), డి.పూజ (జడ్పీహెచ్‌ఎస్ పెద్దగుండవెల్లి సిద్దిపేట) స్టాండ్‌పైగా కావ్య (సిద్దిపేట) ఎంపికయ్యారన్నారు. కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షుడు వెన్నెల మల్లారెడ్డి, టేబుల్ టెన్నిస్ ప్రతినిధు లు బాలకృష్ణారెడ్డి, ప్రశాంత్, వెంకట్‌లక్ష్మణ్, అసిస్టెంట్ డైరెక్టర్ సిద్దిపేట విద్యాశాఖ, క్లబ్ కార్యదర్శి శ్రీనివాస్, పీడీ ప్రభు, వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

56
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...