గ్రామాల రూపురేఖలు మార్చుకోవాలి


Tue,September 17, 2019 02:05 AM

తూప్రాన్ రూరల్ : గ్రామస్తులు కలిసి కట్టుగా శ్రమిస్తేనే మారుమూల అభివృద్ధి పథంలో ముందుకెళ్తారని జెడ్పీ చైర్ పర్సన్ హేమలతాశేఖర్‌గౌడ్ అన్నారు. మన ఊరు, మన ఇండ్లు, మన రాష్ట్రం అనే నినాదంతో ముందుకు సాగాలన్నారు. మండలంలోని ఘనపూర్‌లో సర్పంచ్ మిద్దింటి పుష్పా, తూప్రాన్ ఎంపీడీవో అరుంధతి, తహసీల్దార్ శ్రీదేవి, మాజీ జెడ్పీటీసీ సుమనలతో కలిసి సోమవారం పల్లెప్రగతి కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. గ్రామ మహిళలతో కలిసి చీపుర్లను చేతపట్టి రోడ్లను ఊడ్చారు. రోడ్లకు ఇరువైవుల, ఇంటి పరిసరాల్లో ఏపుగా పెరిగిన పిచ్చిమొక్కలు, గడ్డిని తొలగించారు. అనంతరం గ్రామంలో కలియ తిరిగుతూ పనులను పరిశీలించారు. పాడుబడిన పెంకుటిండ్లు, పనికి రాకుండా ఉన్న ఇండ్లను స్వచ్ఛందంగా తొలగించుకోవాలని ఆమె సూచించారు. జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాలలోని హాజరు రిజిస్టర్, మధ్యాహ్న భోజన వంట గదిని తనిఖీ చేసి హరితహారం మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లెప్రగతిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు, గ్రామస్తుల భాగస్వామ్యంతో పని చేస్తేనే, గ్రామాలు సత్వర అభివృద్ధి సాధిస్తాయన్నారు. గ్రూపులు, పార్టీలకు అతీతంగా గ్రామాల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించి సీఎం కేసీఆర్ ఆశయాలను నెరవేర్చాలన్నారు. గ్రామాల్లో హరితహారం, పచ్చదనం పరిశుభ్రత, ఇంకుడు గుంతల నిర్మాణాలు, వ్యక్తిగత మరుగుదొడ్లు, పరిశుభ్రతపై దృష్టి కేంద్రీకరించాలన్నారు. పురాతన బావులు, చెత్తాచెదారంతో వ్యాధులు వస్తాయన్నారు. మారుమూల గ్రామీణ ప్రాంతాలను త్వరితగతిన అభివృద్ధి పథంలో తీసుకెళ్లేందుకు సీఎం కేసీఆర్ చూపిస్తున్న చొరవకు ప్రజలు సహకరించి గ్రామాల రూపురేఖలు మార్చుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఆకులరవి, ఈజీఎస్ ఏపీవో కృష్ణారెడ్డి, కార్యదర్శి శ్రీనివాస్, టీఏలు మాచర్ల, తిరుమలస్వామి, టీఆర్‌ఎస్ నాయకులు వనం సురేశ్, సంతోశ్, వేణు, అన్వర్, వసీం, వెంకటేశ్, వికాస్, గణేశ్ తదితరులు పాల్గొన్నారు.

60
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...