నీటి వినియోగంపై త్వరలో డాక్యుమెంటరీ


Tue,September 17, 2019 02:05 AM

హవేళిఘనపూర్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మిషన్ కాకతీయ ఫలితాలు, తెలంగాణ నీటియాజమాన్య పద్ధతులు, నీటి వినియోగంపై న్యూఢిల్లీ నేషనల్ జియోగ్రఫీ ఛానెల్, నీటి సాంకేతిక పరిశోధన కేంద్రం బృందం సభ్యులు సోమవారం మండల పరిధిలోని శమ్నాపూర్ గ్రామంలోని దేవుని చెరువును ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీ కన్వీనర్ ప్రవీణ్‌రావు సూచన మేరకు కిషన్ భారతి కో- ఆపరేటీవ్ సొసైటీ సభ్యులు రాహుల్‌పాండే, డిప్యూటీ మేనేజర్ ఉమేశ్‌మిశ్రా, నీటి సాంకేతిక పరిశోధన బృందం సభ్యులు ఉమాదేవి, నీటి సాంకేతిక పరిశోధన అధికారి శంకర్ ప్రసాద్‌లు పరిశీలించారు. ఈ సందర్భంగా రాహుల్‌పాండే చెరువుకు చేపట్టిన మరమ్మతులు దాని వల్ల కలిగే ప్రయోజనాలను ఇరిగేషన్ జేఏఈ శ్రీహరి వివరించారు. మిషన్ కాకతీయలో భాగంగా పూడిక తీయడం ద్వారా శమ్నాపూర్ చెరువుకట్ట నిండి పొంగిపొర్లడంతో పాటు గొలుసుకట్టు చెరువులైన అవుసులపల్లి, మెదక్ పట్టణంలోని చెరువుకుంటలకు సాగునీరందుతుందని ఆయన వివరించారు. మిషన్ కాకతీయ పనులు చేపట్టడం వల్ల కలిగే ప్రయోజనాలను అడిగి తెలుసుకున్నారు. చెరువులు కుంటలు నిండడం ద్వారా మత్స్యసంపదను నమ్ముకొని బతుకున్న మత్స్యకారులకు, పంటలను సాగు చేసుకునేందుకు రైతులకు, ఇతర అవసరాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. నీటి వినియోగం వల్ల ఏయే లాభాలుంటాయనే దానిపై పూర్తి పరిశోధన జరిపి డాక్యుమెంటరీ తయారు చేయనున్నట్లు రాహుల్‌పాండే వివరించారు. కార్యక్రమంలో హార్టికల్చర్ సైంటిస్టు చైతన్య, ప్రశాంత్, నీటి సాంకేతిక పరిజ్ఞాన కేంద్రం డైరెక్టర్ ఉమాదేవి బృందం సభ్యులు, వాటర్ మేనేజర్‌మెంట్ ఫోరం కన్వీనర్ శంకర్‌ప్రసాద్, ఎంపీపీ శేరి నారాయణరెడ్డి, జెడ్పీటీసీ సుజాతశ్రీనివాస్‌రెడ్డి, గ్రామ సర్పంచ్ లింగం, యశోదరమేశ్, రాజేందర్‌రెడ్డి, ఇరిగేషన్ జేఏఈ శ్రీహరి ఉన్నారు.

50
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...