ప్రజలను భాగస్వాములను చేయండి


Sun,September 15, 2019 11:25 PM

మనోహరాబాద్ : ప్రభుత్వం చేపట్టిన ప్రణాళిలో ప్రజలు భాగస్వాములు అయ్యే విధంగా వారికి అవగాహన కల్పించాలని డీపీవో హనోక్ అన్నారు. మనోహరాబాద్ ఎంపీడీవో కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులతో సమీక్షా సమావేశాన్ని ఆదివారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... 30 రోజుల ప్రణాళికలో మహిళా గ్రూపు సభ్యులు పాల్గొనే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజలతో ఏ విధంగా మమేకం కావాలి, వారిని ప్రోత్సహించి గ్రామాభివృద్ధిలో పాల్గొనెలా ఎలా చేయాలో వివరించారు. శిథిలావస్థకు చేరుకున్న ఇండ్లను రెండుమూడు రోజుల్లో కూల్చివేయించాలన్నారు. స్వచ్ఛత పాటించని వారికి నోటీసులు, జరిమానాలు విధించాలన్నారు. హరితహారం మొక్కలను కాపాడటంలో ప్రత్యేక జాగ్రత్తలను పాటించాలన్నారు. అంతకుముందు గ్రామాల్లో జరుగుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు. కార్యక్రమంలో ఎంపీడీవో జైపాల్‌రెడ్డి, ఎంపీవో సతీశ్, పంచాయతీ కార్యదర్శులు సత్యనారాయణ, ప్రభాకర్‌రెడ్డి, సంతోశ్, శంకర్, ప్రవీణ్ పాల్గొన్నారు.

70
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...