అభివృద్ధి పనులు భేష్


Sun,September 15, 2019 11:24 PM

తూప్రాన్ రూరల్: మెదక్ మండలం మక్తభూపతిపూర్ ప్రజాప్రతినిధులు, గ్రామ యువకులు, మహిళలు ఆదివారం తూప్రాన్ మండలం మల్కాపూర్ గ్రామాన్ని సందర్శించారు. గ్రామసర్పంచ్, పంచాయతీ పాలకమండలి సభ్యులు, 120మంది యువకులు గ్రామంలో పర్యటించి గ్రామాభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గ్రామంలోని రోడ్లకు ఇరువైపులా నాటిన హరితహారం మొక్కలు, ఇంటింటికీ నిర్మించుకున్న ఇంకుడు గుంతల నిర్మాణాలు, వ్యక్తిగత మరుగుదొడ్లు, రాక్‌గార్డెన్, సేంద్రియ ఎరువుల తయారీ కేంద్రాన్ని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. గ్రామంలో పచ్చదనం, పరిశుభ్రతను చూసి మంత్రముగ్ధులయ్యారు. ప్రతి ఆదివారం క్రమం తప్పకుండా స్వచ్ఛభారత్ కార్యక్రమాలను మేక్‌ఇన్ మల్కాపూర్ యూత్ సభ్యులు చేస్తుండటంతోనే సత్వరంగా గ్రామాభివృద్ధి జరిగిందని మల్కాపూర్ గ్రామస్తులు పేర్కొన్నారు. అయితే మల్కాపూర్ తరహాలోనే తమ గ్రామంలోనూ అభివృద్ధి పనులు చేసుకుంటామని మక్తభూపతిపూర్ ప్రజాప్రతినిధులు అన్నారు.

64
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...