చాముండేశ్వరీ ఆలయాన్ని సందర్శించిన కవులు, కళాకారులు


Sun,September 15, 2019 11:24 PM

చిలిపిచెడ్: మండలంలోని చిట్కుల్ గ్రామ శివారులోని మంజీరానది ఒడ్డున ఉన్న చాముండేశ్వరీ ఆలయాన్ని రాష్ట్రంలోని 31 జిల్లాల కవులు, కళాకారులు సందర్శించారు. ఆదివారం రాష్ట్ర మల్లినాథిసూరి కళాపీఠం వ్యవస్థాపక అధ్యక్షుడు లచ్చిరెడ్డి ఆధ్యర్వంలో 216 మంది కవులు, కళాకారులు పురాతన రాణి శంకరమ్మ కట్టడాలను, కోటలను పరిశీలించారు. అనంతరం లచ్చిరెడ్డి మాట్లాడుతూ రాణి శంకరమ్మ కట్టడాలను, కోటలను ఒక్కరోజు ప్రయాణంలో ఉమ్మడి మెదక్ జిల్లాలోని రాణి శంకరమ్మ చరిత్రను పరిశీలించామన్నారు. అందులో భాగంగా ఆదివారం సంగారెడ్డి పసల్‌వాది, అందోల్, అన్నాసాగర్, చాముండేశ్వరీ, ఏడుపాయల, పాపన్నపేట, పెద్దశంకరంపేట, వెల్పుగొండ, మెదక్‌లో ఉన్న పురాతన కట్టడాలను, కోటలను సందర్శించి వాటిలోని విషయాలను గుర్తించి.. రాణి శంకరమ్మ సంకలనం పుస్తకాన్ని తయారు చేస్తామన్నారు. అనంతరం ఆలయంలో అమ్మవారికి కవులు, కళాకారులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. చిట్కుల్ గ్రామానికి చెందిన ఆలయ కమిటీ సభ్యులు, టీఆర్‌ఎస్ నాయకులు రామచంద్రారెడ్డి వారికి ఆలయంలో అన్నదానం చేశారు. కార్యక్రమంలో కళాపీఠం సభ్యులు వడ్ల వెంకటేశం, గీతాశ్రీ, వెంకటకవి, గీతాశైలజ, అరవింద్, నారాయణ పాల్గొన్నారు.

64
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...