ఆలయాల్లో పూజలు


Sun,September 15, 2019 11:24 PM

పాపన్నపేట: పవిత్రపుణ్యక్షేత్రమైన ఏడుపాయల వనదుర్గ భవానీమాత ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. ఆదివారం వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు పెద్దసంఖ్యలో చేరుకొని మంజీరానదిలోని వివిధ పాయల్లో పుణ్యస్నానాలు చేసి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈవో మోహన్‌రెడ్డి ఆలయ సిబ్బంది, రవికుమార్, సిద్దిపేట, శ్రీనివాస్, సూర్యశ్రీనివాస్, లక్ష్మీనారాయణ, మధుసూదన్‌రెడ్డి, ప్రతాప్‌రెడ్డి, శ్రీనివాస్‌శర్మ భక్తుల సౌకర్యాల కల్పనలో నిమగ్నం అవగా, వేద బ్రాహ్మణులు నరసింహచారి, శంకర్‌చారి, శంకర్‌శర్మ, పార్థీవశర్మ, నాగరాజ్‌శర్మ, రామశర్మ, రాజశేఖరశర్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేయడంలో నిమగ్నమయ్యారు. భక్తులు అమ్మవారికి ఒడిబియ్యం, కుంకుమార్చనలు, తలనీలాలు, బోనాలు సమర్పించారు. ఏడుపాయల్లో ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా పాపన్నపేట ఎస్‌ఐ ఆంజనేయులు తగిన బందోబస్తు చర్యలు చేపట్టారు.

57
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...