మంత్రులను కలిసిన ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి


Sun,September 15, 2019 11:23 PM

మెదక్, నమస్తే తెలంగాణ: మెదక్ నియోజకవర్గ అభివృద్ధి కోసం నిధులు మంజూరు చేయాలని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి ఆదివారం శాసనసభ వాయిదా అనంతరం మంత్రులు హరీశ్‌రావు, ఎర్రబెల్లి దయాకర్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి, ఇం ద్రకరణ్‌రెడ్డిలను కలిసి విన్నవించారు. మెదక్‌లోని డంపుయార్డ్‌కు ప్రధాన రోడ్డు నుంచి రైల్వే స్టేషన్ మీదుగా వంద ఫీట్ల రోడ్డు డివైడర్‌తో పాటు సెంట్రల్ లైటింగ్ సిస్టం, చేగుంటకు నర్స్‌ఖేడ్ మీదుగా లింక్ రో డ్డు, పాపన్నపేట మండలం లక్ష్మీనగర్ నుంచి గాంధారిపల్లి వరకు నూతన రోడ్డు, ఏడుపాయల నుంచి పోతంశెట్టిపల్లి వరకు నూతనంగా నిర్మించిన బ్రిడ్జీల మీదుగా రోడ్డుకు నిధులు మంజూరు చేయాలని విన్నవించగా మంత్రి ఎర్రబెల్లి సానుకూలంగా స్పందించినట్లు ఆమె తెలిపారు. అలాగే మెదక్‌లో ఇందిరాగాంధీ స్టేడియం మరమ్మత్తులకు మంజూరైన రూ.70 లక్షలు విడుదలకు క్రీడామంత్రి శ్రీనివాస్‌గౌడ్ హామీ ఇచ్చినట్లు పద్మాదేవేందర్‌రెడ్డి వెల్లడించారు. నిజాంపేట-రాంపూర్ వయా నస్కల్, నార్సింగి-శేరిపల్లి ఆర్‌అండ్‌బీ రోడ్డు మిర్జాపల్లి వరకు, పాపన్నపేట నుంచి పెద్ద శంకరంపేట వయా చీకోడ్ మీదుగా ఆర్ అండ్ బీ డబుల్ రోడ్డుకు నిధులు నిధులు మంజూరు చేయాలని కోరడంతో రోడ్డు, భవనాల శాఖ మంత్రి ప్రశాంత్‌రెడ్డి తప్పకుండా మంజూరు చేస్తానని హామీ ఇచ్చినట్లు ఆమె పేర్కొన్నారు.

70
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...