అడవి పందుల దాడిలో పత్తిపంట ధ్వంసం


Sun,September 15, 2019 11:22 PM

చేగుంట: పత్తి పంటను అడవి పందులు ధ్వంసం చేసిన ఘటన రుక్మాపూర్‌లో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన చంద సత్తమ్మ తనకున్న 3ఎకరాల వ్యవసాయ భూమిలో పత్తి పంటను వేసింది. శనివారం రాత్రి పందులు దాడి చేసి కాయలను కొరికి వేయడంతో పాటు పంటను పూర్తిగా ధ్వంసం చేసినట్లు రైతు సత్తమ్మ ఆవేదన వ్యక్తం చేసింది. అడవి పందుల దాడిలో నష్టపోయిన తన పత్తి పంట విలువ సుమారు రూ.70వేల వరకు ఉంటుందని, ప్రభుత్వం అడవి పందుల భారీ నుం చి పంటను రక్షించి నష్టపోయిన పంటకు ఆదుకోవాలని బాధిత మహిళ రైతు కోరారు.

47
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...