వ్యవసాయానికి డ్రోన్


Sat,September 14, 2019 11:48 PM

-పైలట్ ప్రాజెక్టుగా నార్సింగి మండలంలో శ్రీకారం
-వరి, మొక్కజొన్న, పత్తి పంటలపై మిడుత పురుగులు, గడ్డిచిలుకల దాడి
- డ్రోన్ సాయంతో పంటలకు మందు పిచికారి
-సంతోషం వ్యక్తం చేస్తున్న అన్నదాతలు
- డ్రోన్‌తో కలిగే ప్రయోజనాలను వివరించిన
-జిల్లా వ్యవసాయ అధికారి పరశురాంనాయక్

చేగుంట: రైతుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని జిల్లా వ్యవసాయ అధికారి పరశురాం నాయక్ పేర్కొన్నారు.నార్సింగి మండల పరిధిలోని పలు గ్రామాల్లో రైతులు వేసిన వరి,మొక్కజొన్న,పత్తి పంటలపై మిడుత పురుగులు,గడ్డిచిలుకలతో నష్టపోయిన పంటలపై డ్రోన్ సాయంతో శనివారం మందును పిచికారీ చేయించారు.ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయశాఖ అధికారి పరశురాంనాయక్ మాట్లాడుతు మెదక్ జిల్లాలో పైలెట్ ప్రాజెక్టుగా మండలకేంద్రమైన నార్సింగితో పాటు సంకాపూర్‌లోని రైతులు వేసిన వరి ,మొక్కజొన్న పంటలకు మందును పిచికారీ చేయడానికి నిజామాబాద్ జిల్లా నుంచి డ్రోన్ యంత్రాన్ని తెప్పించి నార్సింగికి చెం దిన బానప్పగారి శ్రీనివాస్‌రెడ్డి వరి పొలంలో,సంకాపూర్‌లోని రాయాలపూర్ శ్రీనివాస్‌కు చెందిన మొక్కజొన్న చేనులో మందును పిచికారీ చేయించడం జరిగిందన్నారు.

ఒక ఎకరం మొక్క జొన్న పంటకు 20లీటర్ల నీటిలో రెండు వందల ఎంఎల్ మాలథియాన్ మందును.వరి పంటకు 20లీటర్లలో వంద గ్రాముల క్లోరిఫైరిపాస్ మందును పంటలపై పిచికారీ చేయించినట్లు డీఏవో తెలిపారు.పంట నష్టం జరుగకుండ డ్రోన్ సహాయంతో మందును పిచికారీ చేయడానికి గంటకు రూ.4వందల రూపాయల చార్జి చెల్లించినట్లు డీఏవో పరశురాంనాయక్ తెలిపారు.ఈ కార్యక్రమంలో రామాయంపేట ఏడీఏ వసంత సుగుణ ,నార్సింగి,ఏవో యాదగిరి, రామాయంపేట, నర్సపూర్ ఏవోలు రాజనారాయణ,వెంకటేశ్,తునికి కృషి విజ్ఞాకేంద్రం వ్యవసాయ శాస్త్రవేత లు శ్యామ్‌సుందర్,రవికుమార్,ఏఈవోలు విజృంభణ,దివ్య,మండలరైతు సమన్వయకమిటీ అధ్యక్షుడు లింగారెడ్డి, రైతులు పాల్గొన్నారు.

77
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...