మద్యం విక్రయాలు జరుపవద్దని గ్రామస్తులు తీర్మానం


Sat,September 14, 2019 11:44 PM

చిన్నశంకరంపేట: గ్రామంలో ఇకనుంచి మద్యం విక్రయాలు జరుపరాదని మహిళలు, గ్రామస్తులు ఏకగ్రీవంగా తీర్మానంచేసి ప్రతిజ్ఞ చేశారు. శనివారం చిన్నశంకరంపేట మండలం సూరారం గ్రామంలో మహిళలు, గ్రామస్తులంతా కలిసి గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద గ్రామసభను ఏర్పాటు చేసుకొని ఇక నుంచి గ్రామంలో మద్యాన్ని విక్రయించరాదని ఏకగ్రీవంగా తీర్మానించుకున్నారు. గ్రామ తీర్మానాన్ని ఉల్లంఘించి, గ్రామంలో ఎవరైనా మద్యం విక్రయిస్తే రూ.25వేలు మద్యాన్ని కొనుగోలు చేసిన వారికి రూ.15వేలు జరిమాన విధించాలని తీర్మానించారు. మద్యం విక్రయాలు కొనుగోలు సమాచారాన్ని అందించిన వారికి రూ.5వేల నజరానాను ప్రకటించారు. ఈ విషయంపై మహిళలు, గ్రామస్తులు ఏకగ్రీవ తీర్మానం చేసి ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు లకా్ష్మరెడ్డి, టీఆర్‌ఎస్ మండలశాఖ అధ్యక్షుడు రాజు, ఎంపీటీసీ అనురాధ, సర్పంచ్ నీరజ, మాజీ సర్పంచ్ నాగరాజు, ఉపసర్పంచ్ గోవర్ధన్‌రెడ్డి, నాయకులు పవన్‌గౌడ్, స్వామి, గ్రామస్తులు ఉన్నారు.

57
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...