17,18 తేదీల్లో అండర్ 17 కబడ్డీ పోటీలు


Sat,September 14, 2019 11:44 PM

పాపన్నపేట: పాఠశాల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో ఈ నెల 17,18 తేదీల్లో మెదక్ జిల్లా స్థాయి అండర్17 బాయ్స్ అండ్ గర్ల్స్ కబడ్డీ టోర్నమెంట్‌మండల పరిధిలోని యూసుఫ్‌పేటలో నిర్వహించనున్నట్లు మండల విద్యాధికారి మోహన్‌రాజు,పీడీ చంద్రమోహన్ మండల పరిధిలోని పీఈటీలు ఒక సంయుక్త ప్రకటనలో వెల్లడించారు. యూసుఫ్‌పేట ఉన్నత పాఠశాల గ్రౌండ్‌లో నిర్వహించే ఈ కబడ్డీ పోటీల్లో 17వ తేదీన బాలురకు కబడ్డీ పోటీలు ఉంటాయని 18వ తేదీన బాలికలకు కబడ్డీ పోటీలు ఉంటాయని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. క్రీడాకారులకు భోజన సౌకర్యం కల్పించినట్లు వారు వెల్లడించారు. ఈ పాల్గొనదలచిన క్రీడాకారులు ఆయా తేదీల్లో ఉదయం 9 గంటలకు రిపోర్టు చేయాల్సిందిగా వారు సూచించారు.

50
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...