అభివృద్ధిలో కూచారం భేష్


Sat,September 14, 2019 11:44 PM

మనోహరాబాద్ : సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన 30 రోజుల ప్రణాళికలో స్వచ్ఛందంగా పాల్గొని, అభివృద్ధిలో జిల్లాలోనే మొదటి స్థానంలో కూచారం నిలువాలని జెడ్పీ చైర్ పర్సన్ హేమలతాశేఖర్‌గౌడ్ అన్నారు. మనోహరాబాద్ మండలం కూచారం గ్రామంలో శనివారం జెడ్పీ చైర్‌పర్సన్ పర్యటించారు. 30 రోజుల ప్రణాళికలో భాగంగా కొనసాగుతున్న పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్‌పర్సన్ మాట్లాడుతూ ప్రణాళికలో పొందుపర్చిన విధంగా పనులను చురుకుగా నిర్వహించాలన్నారు. గ్రామంలో శిథిలావస్థలో ఉన్న ఇండ్లను త్వరగా కూల్చివేయించాలన్నారు. ఇతర రాష్ర్టాల గ్రామాలు తెలంగాణకు వచ్చి నేర్చుకునే విధంగా ఇక్కడి గ్రామాలను తయారుచేయాలన్నదే సీఎం కేసీఆర్ ఆశయమన్నారు. మొదటి వారం నుంచి ఆఖరి వారం వరకు పారిశుధ్యం, ఫవర్‌వీక్, హరితహారం, శ్రమదానం వంటి అంశాలతో 30 రోజుల వరకు గ్రామంలో పనులు జరుగుతాయన్నారు. మార్పు అనేది మన నుంచి మొదలు అయినప్పుడే 30 రోజుల ప్రణాళిక విజయవంతమవుతుందన్నారు.

ఐదో విడుతలో ప్రతి గ్రామంలో నర్సరీలను ఏర్పాటు చేసి మొక్కలను పెంచడం జరుగుతుందన్నారు. యువకులు, గ్రామస్తుల కృషితో గ్రామ హరితవనాన్ని ఏర్పాటు చేసుకోవడం అభినందనీయమన్నారు. జిల్లాలో మరో ఆదర్శ గ్రామంగా కూచారం నిలువాలని ఆకాంక్షించారు. అనంతరం అంగన్‌వాడీ కేంద్రంలో జరుగుతున్న పోషణ్ అభియాన్ కార్యక్రమంలో పాల్గొని గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారంపై పలు అంశాలను వివరించారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈవో లక్ష్మీబాయి, మండల ప్రత్యేకాధికారి కృష్ణమూర్తి, ఎంపీడీవో జైపాల్‌రెడ్డి, ఎంపీవో సతీశ్, ఎంపీపీ పురం నవనీతారవి ముదిరాజ్, వైస్ ఎంపీపీ విఠల్‌రెడ్డి, సర్పంచ్ జక్కిడి నరేందర్‌రెడ్డి, పంచాయతీ కార్యదర్శి సత్యనారాయణ, యూత్ నాయకుడు రమేశ్‌గౌడ్, రైతు సమన్వయ సమితి గ్రామ కో-ఆర్డినేటర్ తీగుళ్ల నాగిరెడ్డి, నేచర్ ఐకాన్ కూచారం యువజన సంఘం సభ్యులు పాల్గొన్నారు.

63
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...