పోషణ్ అభియాన్‌తో మాతా, శిశు సంరక్షణ


Sat,September 14, 2019 11:43 PM

టేక్మాల్: మాతా, శిశు సంరక్షణ కోసం అంగన్‌వాడీ కేంద్రాల తో పోషక ఆహారాన్ని అందజేయడం జరుగుతుందని ప్రోగ్రాం కో ఆర్డినేటర్ వెంకట్ పేర్కొన్నారు. మండల పరిధిలోని షాబాద్ అంగన్‌వాడీ కేంద్రంలో నల్లకుంట తండా, దండవానికుంట తండా, ముత్యాలబంధం తండాల అంగన్‌వాడీ కేంద్రాల పరిధిలోని గర్భిణులు, బాలింతలకు పోషక ఆహారంపై శనివారం అవగాహన కల్పించారు. అనంతరం గర్భిణులకు సీమంతం, చిన్నారులకు అన్నప్రాసన చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రమావత్ పూరి, పంచాయతీ కార్యదర్శి ఇసాక్, అంగన్‌వాడీ టీచర్లు సుజాత, కుమారి, వెంకటలక్ష్మి, లలిత ఉన్నారు.

మెదక్ రూరల్ లో
మెదక్ రూరల్ : అంగన్‌వాడీ కేంద్రంలో ప్రతి నెలా రెండు సార్లు (ఎన్‌హెచ్‌డీ, టీహెచ్‌ఆర్) చిన్నారులకు బరువు కొలువడం జరుగుతుందని మెదక్ మండలంలోని మక్తభూపతిపూర్ గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రం 2 టీచర్ మహేశ్వరి తెలిపారు. శనివారం అంగన్‌వాడీ కేంద్రంలో చిన్నారులకు ప్రతి నెలా రెండు సార్లు బరువులతో పాటు కొలతలను తీయడం జరుగుతుందన్నారు. వయస్సును బట్టి ఎన్ని కిలోలు ఉన్నారు.. ఎంత బరువు ఉన్నారని చూడటం జరుగుతుందన్నారు. ఒక వేళ బరువు తక్కువగా ఉంటే పౌష్టికాహారాన్ని ఇవ్వడం జరుగుతుందన్నారు. అంగన్‌వాడీ కేంద్రంలో ప్రతి రోజు పోషణ్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ప్రతి రోజు ఏదో ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. అంగన్‌వాడీ కేంద్రానికి వచ్చే బాలింతలకు, గర్భిణులకు పౌష్టికాహారంతో పాటు గుడ్లు, ఆకు కూరలు అందజేయడం జరుగుతుందన్నారు.

53
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...