పల్లెపల్లెన ప్రగతి పనులు


Sat,September 14, 2019 12:07 AM

-శివ్వంపేటలో వీధులు శుభ్రం చేసిన ప్రజాప్రతినిధులు, అధికారులు
-చిన్నశివునూర్ గ్రామంలో పల్లెనిద్ర చేసిన డీపీవో, అధికారులు
-గ్రామాల్లో కొనసాగుతున్న అభివృద్ధి పనులు

మెదక్ ప్రతినిధి, నమస్తేతెలంగాణ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 30రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక అమలుకోసం 8 వరోజు శుక్రవారం జిల్లా వ్యాప్తంగా 469గ్రామ పంచాయతీల్లో సభలు, సమావేశాలు జరిగాయి. స్టాండింగ్ కమిటీలు, కో-ఆప్షన్‌సభ్యులు సర్పంచ్‌ల ఆధ్వర్యంలో, మండల, జిల్లాస్థాయి అధికారులు, గ్రామాల్లో వీధులను శుభ్రపరిచి, మురుగుకాల్వలను శుభ్ర పరిచే కార్యక్రమాల్లో పాల్గొన్నారు. జిల్లా పంచాయతీ అధికారి హనోక్ ఆధ్వర్యంలో అధికారులు పల్లెనిద్ర చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో కలిసి శ్రమదానం నిర్వహించారు. మైనింగ్ ఏడీ జయరాజ్ గ్రామసర్పంచ్ స్టాండింగ్ కమిటీ సభ్యులు మహిళలు గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. గ్రామస్తులతో ప్రతిజ్ఞ చేయించారు.

గ్రామగ్రామాన ప్రత్యేక సందడి నెలకొన్నది. సర్పంచ్, ఉపసర్పంచ్, కో-ఆప్షన్ సభ్యులు, పంచాయతీ వార్డు సభ్యులు, అధికారులు కలిసి కట్టుగా గ్రామాల్లో పల్లెప్రగతి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. గ్రామసమస్యల గుర్తింపుతోపాటు సమస్యల పరిష్కారానికి పంచాయతీ పాలకవర్గంతో పాటు, స్థాయీసంఘం సభ్యులు, కో-ఆప్షన్ సభ్యులు కృషి చేస్తున్నారు. ముఖ్యంగా శుక్రవారం గ్రామాగ్రామాన వీధులు శుభ్రపరిచే కార్యక్రమానికి ప్రాధాన్యతనిచ్చారు. మురుగు కాల్వలు శుభ్రపరిచి, పిచ్చిమొక్కలను తొలిగించే కార్యక్రమాలను దాదాపు అన్ని గ్రామపంచాయతీల్లో చేపట్టారు. చేగుంట మండలం చిన్నశివునూర్ గ్రామంలో పెద్ద ఎత్తున గ్రామస్తులు పిచ్చిమొక్కలు తొలిగించారు.

కొల్చారం మండలంలోని పాడుబడ్డ ఇండ్లను తొలిగించి తుక్కాపూర్‌లో డంప్‌యార్డ్ నిర్మాణం కోసం అధికారులు గ్రామస్తులు కలిసి ముగ్గుపోసి శంకుస్థాపన చేశారు. గ్రామసర్పంచ్ మధవి, ఉప సర్పంచ్ స్వాతి ప్రియ పాల్గొన్నారు. కొంగోడ్ గ్రామ శివారులో రోడ్డుకు ఇరువైపులా పిచ్చి మొక్కలను తొలిగించారు. తూప్రాన్ మండలం మాల్కాపూర్ గ్రామంలో విదేశీ ప్రతినిధులు గ్రామాన్ని శుభ్రంచేసి పిచ్చిమొక్కలు తొలిగించి వీధులను శుభ్రంచేశారు. చిన్నశంకరంపేట మండలంలోని జెడ్పీటీసీ మాధవి, ఎంపీపీ అవుల భాగ్యలక్ష్మి , గోపాల్‌రెడ్డి పల్లె ప్రగతి పనుల్లో పాల్గొన్నారు. మనోహరాబాద్ వెల్దుర్తి, రామాయంపేట్, నిజాంపేట్, పాపన్నపేట, నర్సాపూర్, శివ్వంపేట్, హవేళిఘనపూర్, మెదక్ మండలాల్లో పల్లె ప్రగతి పనులు జోరందుకున్నాయి.

గ్రామాల రూపురేఖలు మారుతాయి...డీపీవో హనోక్
గ్రామాల రూపురేఖలు మార్చేందుకే 30 రోజుల ప్రణాళికను ప్రభుత్వం అమలు చేస్తుందని జిల్లా పంచాయతీ అధికారి హనోక్ అన్నారు. గ్రామాల్లో వీధులన్ని మురికి కాలువలు శుభ్రంగా ఉంటే అంటు వ్యాధులు ప్రబలకుండా ఉంటాయని పేర్కొన్నారు. గ్రామ సర్పంచ్, ఉపసర్పంచ్ వార్డు సభ్యులు స్థాయీ సంఘాల సభ్యులు శ్రమిస్తే గ్రామల అభివృద్ధి చెంది వాటి స్వరూపమే మారుతాయన్నారు.

88
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...