మల్కాపూర్ తరహాలో అభివృద్ధి చేస్తాం


Sat,September 14, 2019 12:01 AM

తూప్రాన్ రూరల్: మల్కాపూర్‌లో జరిగిన అభివృద్ధి పనులు ఇతర దేశాలకు ఆదర్శంగా ఉన్నాయని ఇండోనేషియా ప్రతినిధుల బృందం పేర్కొంది. సీఎం కేసీఆర్ ఆశయాలకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్రంలో మారుమూల గ్రామాల బలోపేతానికి సమష్టిగా కృషి చేస్తున్న విధానం ప్రశంసనీయమన్నారు. ముఖ్యంగా మహిళలు, యువకుల భాగస్వామ్యంతో మారుమూల గ్రామాలు అభివృద్ధి పథంలో ముందుకు దూసుకెళ్తున్నాయని, ఇదే తరహాలో తమ దేశంలోనూ అభివృద్ధిలో ముందుకు సాగుతామన్నారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్యర్యంలో శుక్రవారం ఇండోనేషియా ప్రతినిధుల బృందం సభ్యులు మెదక్ జిల్లా తూప్రాన్ మండలం మల్కాపూర్‌లో పర్యటించారు. మల్కాపూర్ గ్రామస్తులతో కలిసి తెలంగాణ జానపద గీతాలను ఆలపించారు. గ్రామంలోని ప్రతి ఇంటి పరిసరాల్లో నాటిన పండ్లు, పూల మొక్కలను పరిశీలన చేశారు.

తడి పొడి చెత్తను వేరు చేసేందుకు గానూ గ్రామ శివారులో నిర్మించిన సేంద్రియ ఎరువుల తయారీ కేంద్రం, డంపింగ్‌యార్డులను పరిశీలించారు. మేక్‌ఇన్ మల్కాపూర్ యువత అధ్యక్షుడు కిష్టాల రవిని పరిచయం చేసుకొని గ్రామంలో రోడ్లను ఊడ్చారు ఈ సందర్భంగా ఆర్డీవో శ్యామ్‌ప్రకాశ్, ఎంపీడీవో అరుంధతిలు మాట్లాడుతూ.. ఐదేండ్లుగా చేస్తున్న కృషి ఫలితంగానే మల్కాపూర్ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిందన్నారు. అనంతరం ఇండోనినేషియా ప్రతినిధులు మాట్లాడారు. కార్యక్రమంలో ఎన్‌ఆర్‌ఐడీ అసిస్టెంట్ ప్రొఫెసర్ నాగభూషణంరావు, తూప్రాన్ ఆర్డీవో శ్యామ్‌ప్రకాశ్, ఎంపీడీవో అరుంధతి, ఎంపీవో రమేశ్, కార్యదర్శులు రాజేశ్, మహేందర్, సర్పంచ్ మహాదేవినవీన్, ఎంపీటీసీ పంజాల వెంకటమ్మ, ఈజీఎస్ ఏపీవో కృష్ణారెడ్డితో పాటు ఇండోనేషియా ప్రతినిధుల బృందం సభ్యులు, మేక్‌ఇన్ మల్కాపూర్ యూత్ సభ్యులు పాల్గొన్నారు.

47
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...