తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టుల పాత్ర కీలకం


Sat,September 14, 2019 12:00 AM

నర్సాపూర్,నమస్తే తెలంగాణ: తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టుల పాత్ర ఎంతో కీలకమైందని కాంగ్రెస్ పార్టీ మెదక్ పార్లమెంటు ఇన్‌చార్జి గాలి అనీల్‌కుమార్ అన్నారు. శుక్రవారం జర్నలిస్టు దినోత్సవాన్ని నర్సాపూర్ మండల పరిషత్ సమావేశ మందిరంలో ఎంపీపీ జ్యోతి సురేశ్‌నాయక్ ఆధ్వర్యంలో ఘనంగా జరిపారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ మెదక్ పార్లమెంటు ఇన్‌చార్జి గాలిఅనీల్‌కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా నర్సాపూర్‌లో పనిచేస్తున్న జర్నలిస్టులను పూలమాల, శాలువాతో ఘనంగా సత్కరించి మెమోంటో అందజేశారు. అనంతరం గాలిఅనిల్‌కుమార్ మాట్లాడారు.

టీపీసీసీ అధికార ప్రతినిధి మాణయ్య, టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శులు సోమన్నగారి లక్ష్మి, ఆవుల రాజీరెడ్డి, డీసీసీ అధికార ప్రతినిధి ఆంజనేయులుగౌడ్, మాజీ జెడ్పీటీసీ శ్రీనివాస్‌గుప్తా, బ్లాక్‌కాంగ్రెస్ అధ్యక్షుడు రిజ్వాన్, శ్రీనివాస్‌రెడ్డి, పార్టీ మండల అధ్యక్షులు మల్లేశ్, మల్లేశ్‌గౌడ్‌లు జర్నలిస్టులు సమాజానికి చేస్తున్న సేవలను కొనియాడారు. కార్యక్రమంలో జర్నలిస్టులు భిక్షపతి, శ్రీనివాస్, గణేశ్, నర్సింహారెడ్డి, శ్రీనివాస్, భిక్షపతి, శ్రీశైలం, ఠాగూర్, రాజాగౌడ్, షణ్ముకచారి, సుధాకర్, ఆనంద్, రాజుగౌడ్, లింగంగౌడ్, యాదగిరి ఉన్నారు.

57
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...