విద్యుత్ క్యాజువల్ లేబర్ ఆత్మహత్య


Sat,September 14, 2019 12:00 AM

కొల్చారం: అప్పుల బాధతో విద్యుత్ క్యాజువల్ లేబర్ ఆత్మహత్య చేసుకుని మృతి చెందిన ఘటన శుక్రవారం ఉదయం కొల్చారం పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది. కొల్చారం ఏఎస్సై శ్రీనివాస్‌రెడ్డి కథనం ప్రకారం... మండల పరిధిలోని రాంపూర్ గ్రామానికి చెందిన కర్రె ఆంజనేయులు (35) విద్యుత్ శాఖలో క్యాజువల్ లేబర్‌గా గత 15 సంత్సరాల నుంచి పని చేస్తున్నాడు. గత సంవత్సరమే మెదక్ బదిలీ అయ్యాడు. అప్పుల బాధ ఎక్కువ కావడంతో శుక్రవారం ఉదయం 6.30 గంటలకు డ్యూటీకి బయలు దేరేముందు కుటుంబ పోషణకు చేసిన అప్పులు ఇచ్చినవారికి ముఖం చూయించలేకపోతున్నానని భార్య జ్యోతికి చెప్పి బాత్‌రూమ్‌లోకి వెళ్లి ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. భార్య, ఇంటి పక్కవారు మంటలు ఆర్పి మెదక్ తీసుకుపోగా అక్కడినుంచి గాంధీ దవాఖానకు తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయినట్లు తెలిపారు. ఏఎస్సై శ్రీనివాస్‌రెడ్డి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

49
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...