పల్లె ప్రగతికి అడుగులు


Fri,September 13, 2019 03:33 AM

నర్సాపూర్, నమస్తే తెలంగాణ : శివ్వంపేటను అన్ని రకాలుగా అభివృద్ధి చేయడానికి కృషి చేస్తానని గ్రామంలో ఇండ్లు లేని వారి కోసం 100 డబుల్‌బెడ్‌రూం ఇండ్లు మంజూరు చేస్తున్నట్లు ఎమ్మెల్యే మదన్‌రెడ్డి ప్రకటించారు. గురువారం శివ్వంపేటలో జరిగిన పల్లెప్రగతి కార్యక్రమం మండల కేంద్రమైన శివ్వంపేటలో నిర్వహించారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, జెడ్పీ చైర్ పర్సన్ హేమలతాశేఖర్‌గౌడ్, కలెక్టర్ ధర్మారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు గ్రామంలో పర్యటించారు. చెత్తతో పేరుకుపోయిన ప్రధాన రోడ్డును చీపుర్లను చేతపట్టుకుని రోడ్లను ఊడ్చి శుభ్రం చేశారు. అనంతరం గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. హరితహారం కింద మొక్కలను నాటి ట్రీ గార్డులను ఏర్పాటు చేశారు. అనంతరం శివ్వంపేటలో ఏర్పాటు చేసిన సభలో 30 రోజుల ప్రణాళిక ప్రతిజ్ఞ చేసి ప్రజలకు చదివి వినిపించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్‌రెడ్డి మాట్లాడుతూ గ్రామాలు ప్రగతి పట్టడం కోసం రాష్ట్ర ప్రభుత్వం పల్లెప్రగతి కార్యక్రమాన్ని తీసుకొచ్చిందన్నారు. అందరూ కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని అమలు చేయాలని సూచించారు. గ్రామంలో సీసీరోడ్ల ఏర్పాటు కోసం రూ.కోటి మంజూరు చేస్తున్నట్లు మొదటి విడుతలో రూ.50లక్షలు, రెండో విడుతలో రూ.50 లక్షలతో సీసీరోడ్లను నిర్మించుకోవాలని తెలిపారు.

జూనియర్ కళాశాల నిర్మాణం కోసం వారంలోపు శంకుస్థాపన చేసి పనులు ప్రారంభిస్తానని తెలిపారు. మహిళా మండలి భవనం దసరా తర్వాత పనులు మొదలు పెట్టనున్నట్లు తెలిపారు. నీటి సమస్య పరిష్కారం కోసం కోమటిబండ నుంచి నర్సాపూర్ వరకు గోదావరి జలాలను తీసుకొస్తానని అన్నారు. జెడ్పీచైర్‌పర్సన్ హేమలతా శేఖర్‌గౌడ్ మాట్లాడుతూ పల్లెప్రగతి కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన 30 రోజుల ప్రణాళిక పకడ్బందీగా అమలు చేయాలని సూచించారు. పల్లెప్రగతి కార్యక్రమాన్ని గ్రామాల్లో విజయవంతం కోసం కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రాగౌడ్, జెడ్పీటీసీ పబ్బా మహేశ్‌గుప్తా, ఎంపీపీ హరికృష్ణతో, జిల్లా పరిషత్ కో-ఆప్షన్ సభ్యుడు మన్సూర్, ఏడీ నర్సయ్య, డీపీవో హనోక్, పీఏసీఎస్ చైర్మన్ వెంకట్‌రాంరెడ్డి, ఎంపీడీవో నవీన్, స్థానిక సర్పంచ్ శ్రీనివాస్‌గౌడ్, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు పిట్ల సత్యనారాయణతో పాటు ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సీఎం కేసీఆర్ కలలు నిజం చేయాలి...
మనోహరాబాద్ : తెలంగాణ ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన 30 రోజుల ప్రణాళిక గ్రామాల సమగ్రాభివృద్ధి కొరకేనని జెడ్పీ చైర్ పర్సన్ హేమలతాశేఖర్‌గౌడ్, కలెక్టర్ ధర్మారెడ్డి, ఎమ్మెల్యే మదన్‌రెడ్డిలు అన్నారు. మనోహరాబాద్ మండలం గౌతోజీగూడెంలో హరితహారంలో భాగంగా మొక్కలను నాటి, గ్రామస్తులకు చెత్తబుట్టలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్‌పర్సన్ మాట్లాడుతూ 30 రోజుల ప్రణాళికలో మొదటి వారం నుంచి నెలాకరు వరకు పారిశుధ్యం, ఫవర్‌వీక్, హరితహారం, శ్రమదానం వంటి అంశాలతో 30 రోజుల వరకు గ్రామంలో పనులు జరుగుతాయన్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ అభివృద్ధి కేవలం సీఎం కేసీఆర్‌తోనే సాధ్యపడుతుందని అన్నారు. యువకులు, మహిళలు, గ్రామపెద్దలు సమష్టిగా శ్రమదానం చేసి గ్రామాలను దేశం మొత్తం మెచ్చుకునే విధంగా తయారు చేయాలన్నారు. కలెక్టర్ ధర్మారెడ్డి మాట్లాడుతూ గ్రామాలు పరిశుభ్రంగా ఉండాలంటే మహిళల్లో చైతన్యం రావాలి. మహిళలు తలుచుకుంటే గ్రామాలన్నీ స్వచ్ఛ గ్రామాలుగా మారుతాయన్నారు. కార్యక్రమంలో డీపీవో హనోక్, తహసీల్దార్ నజీబ్ అహ్మద్, శివ్వంపేట ఎంపీపీ కల్లూరి హరికృష్ణ, మనోహరాబాద్ ఎంపీపీ పురం నవనీతారవి ముదిరాజ్, ఎంపీటీసీలు శ్రీలతాఆనంద్, లక్ష్మి, సర్పంచులు వెంకటేశ్వర్లు, పూల అర్జున్, పార్వతీసత్యం, ఉప సర్పంచులు రేణుకుమార్, సాయినాథ్, సుగుణ పరిశ్రమ సిబ్బంది, ఆయా గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.

108
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...