కాళేశ్వరంతో ప్రతి ఎకరాకు సాగునీరు


Fri,September 13, 2019 03:33 AM

కొల్చారం : గోదావరి నీళ్లతో నర్సాపూర్ నియోజకవర్గ ప్రజల దాహార్తి తీరుస్తానని ఎమ్మెల్యే మదన్‌రెడ్డి అన్నారు. కొల్చారం మండల పరిధిలోని రంగంపేట శివారులో వెలసిన మదనానంద ఆశ్రమంలో మాధవానంద సరస్వతీ స్వామివారిని గురువారం కలెక్టర్ ధర్మారెడ్డితో కలిసి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్‌రెడ్డి మాట్లాడుతూ గోదావరి నీళ్లు తెచ్చి నర్సాపూర్ ప్రజల దాహార్తి తీర్చడానికి సీఎం కేసీఆర్ ఒప్పుకున్నట్లు తెలిపారు. వారం రోజుల్లో కోమటిబండ నుంచి బోర్పట్ల పైప్‌లైన్ వేసేందుకు అవసరమైన ప్రతిపాదనలు పంపడం జరగుతుందన్నారు. అలాగే కాళేశ్వరం ప్రాజెక్టు కాలువలతో నియోజకవర్గంలోని ప్రతి ఎకరాకు సాగునీరందిస్తానన్నారు. అలాగే మంజీరానది, హల్దీవాగులపై ఏడు చెక్‌డ్యాంల నిర్మాణం సీఎం కేసీఆర్ చొరవతోనే పూర్తయినట్లు, త్వరలో మరో ఆరు చెక్‌డ్యాంల నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు.

మాధవానంద సరస్వతీస్వామిని దర్శించుకున్న
ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, కలెక్టర్ ధర్మారెడ్డి
మాధవానంద సరస్వతీస్వామి చేపట్టిన పద్మాలుగు నెలల చతుర్మాస్య దీక్ష శుక్రవారంతో ముగియనున్నది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, కలెక్టర్ ధర్మారెడ్డిలు వారిని దర్శించుకున్నారు. వేద పండితులు, విద్యార్థులు ఆలయ మర్యాదలతో వారికి స్వాగతం పలికారు. ముందుగా మదనానంద ఆశ్రమంలో లింగార్చన చేయించి మొక్కులు చెల్లించుకున్నారు. ఎమ్మెల్యే వెంట ఎంపీపీ మంజుల కాశినాథ్, మాజీ జెడ్పీటీసీ శ్రీనివాస్‌రెడ్డి, టీఆర్‌ఎస్ మండల మాజీ అధ్యక్షుడు గౌరీశంకర్, ఆయా గ్రామాల సర్పంచులు బండి సుజాత రమేశ్, మాధవి శ్రీశైలం, మానస, వీరారెడ్డి, వైస్ ఎంపీపీ అల్లు మల్లారెడ్డి, ఎంపీటీసీ ఆరట్ల ఎల్లయ్య, మాజీ ఎంపీటీసీలు కవిత శ్రీనివాస్‌గౌడ్, చంద్రశేఖర్‌రెడ్డి, సొసైటీ చైర్మన్ వీపీ మల్లేశం, ఏఎంసీ మాజీ డైరెక్టర్ తలారి దుర్గేశ్, టీఆర్‌ఎస్ నాయకులు శ్రీనివాస్, రవీందర్‌గౌడ్, దుర్గేశ్‌గౌడ్, ఆంజనేయులు, విశ్వపతి, పార్టీ కౌడిపల్లి మండల అధ్యక్షుడు కాలేరు శివాంజనేయులు, రిటైర్టు టీచర్ ప్రభులింగం పాల్గొన్నారు.

89
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...