కార్మికులకు అండగా ఉంటూ


Wed,September 11, 2019 11:46 PM

మనోహరాబాద్: నిరంతరం, వారి హక్కుల సాధనకు కృషి చేస్తానని టీఆర్‌ఎస్‌కేవీ యూనియన్ అధ్యక్షుడు చిట్కుల మహిపాల్‌రెడ్డి అన్నారు. మనోహరాబాద్ మండలం రామాయిపల్లి ఇండస్ మెడికల్ పరిశ్రమలో బుధవారం యూనియన్ ఎన్నికలు జరిగాయి. డీసీఎల్ కోటేశ్వర్‌రావు ఎన్నికల అధికారిగా వ్యవహరించారు. ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కేవీ అభ్యర్థిగా చిట్కుల మహిపాల్‌రెడ్డి, సీఐటీయూ అభ్యర్థిగా మల్లికార్జున్‌లు పోటీల్లో పాల్గొన్నారు.

పరిశ్రమలోనే పర్మినెంట్ ఉద్యోగులు 39 ఓటర్లుగా ఉండగా సీఐటీయూ అభ్యర్థి మల్లికార్జున్‌కు 16 ఓట్లు పోలవ్వగా టీఆర్‌ఎస్‌కేవీ అభ్యర్థి మహిపాల్‌రెడ్డి 23 ఓట్లు సంపాదించి 7 ఓట్ల మెజార్టీతో విజేతగా నిలిచారు. ఈ సందర్భంగా చిట్కుల మహిపాల్‌రెడ్డి మాట్లాడుతూ తనపై నమ్మకంతో గెలిపించుకున్న కార్మికులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఉపాధ్యక్షుడిగా ప్రవీణ్‌కుమార్, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా రాజు, కోశాధికారిగా శ్యాంకుమార్, జనరల్ సెక్రటరీగా జీ.వై. శేఖర్‌లతో పాటు కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ నాయకులు వెంకట్‌గౌడ్, చంద్రశేఖర్‌గౌడ్, జావీద్‌పాషా, దశరథ, కార్మికులు, పాల్గొన్నారు.

46
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...