డైట్ విద్యార్థులకు ప్రోత్సాహకాలు


Wed,September 11, 2019 11:45 PM

హవేళిఘనపూర్: మెదక్ డైట్ కళాశాలలో గత సంవత్సరంలో ప్రతిభ కనబర్చిన ముగ్గురు విద్యార్థులకు హైదరాబాద్‌కు చెందిన గొర్తి ఈశ్వర ఎడ్యుకేషన్ ట్రస్టు ఆధ్వర్యంలో రూ.2500 నగదు బహుమతులను అందజేశారు. గత సంవత్సరంలో తెలుగు విభాగంలో కృష్ణప్రసాద్, ఇంగ్లిష్ విభాగంలో భావన, ఉర్దూ మీడియంలో సభా అంజుంలకు స్కాలర్‌షిప్‌లను మెదక్ డీఎస్పీ కృష్ణమూర్తి చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ కృష్ణమూర్తి మాట్లాడుతూ ప్రతిభగల విద్యార్థులను గుర్తించి ప్రోత్సాహకాలు అందించి వారిని ఉత్సాహపర్చడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ సయ్యద్‌ఆరీఫుద్దీన్, సంస్థ ప్రతినిధి వేణుగోపాల్‌శర్మ, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.

43
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...