ప్రగతిబాటలో..


Wed,September 11, 2019 11:45 PM

చేగుంట : ముఖ్యమంత్రి కేసీఆర్ తెలపెట్టిన 30రోజల ప్రణాళికలో భాగంగా గ్రామ అభివృద్ధి కోసం చేపట్టిన కార్యాచరణకు మంచి స్పందన వస్తుంది. బుధవారం చేగుంటతో పాటు, రాంపూర్, కర్నాల్‌పల్లి, రెడ్డిపల్లి తదితర గ్రామాల్లో రోడ్లకు ఇరువైపులా స్వచ్ఛభారత్ చేసి పిచ్చి మొక్కలను తొలిగించి, వీధులను శుభ్రం చేశారు. ఈ కార్యక్రమంలో మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు మంచికట్ల శ్రీనివాస్, ఏపీఎం లక్ష్మీనర్సమ్మ, ఏపీవో ఆదినారాయణ, సర్పంచులు కాశబోయిన భాస్కర్, సంతోశ్‌రెడ్డి, స్వాతీశ్రీనివాస్, కాశగోని లక్ష్మి, మోహన్, పంచాయతీ కార్యదర్శులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

48
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...