చెట్లను నరికినందుకు జరిమానా


Wed,September 11, 2019 11:43 PM

నిజాంపేట: నందిగామలో గ్రామపంచాయతీ అనుమతి లే కుండా ఇంటివద్ద పెరిగే చెట్లను చల్మేడ గ్రామానికి చెందిన దుబ్బ రాజయ్య తన సొంత లాభానికి చె ట్లను నరికేయడంతో అతనికి పంచాయతీసెక్రటరీ మహమ్మద్ ఆరీఫ్ హుస్సేన్, నందిగామ సర్పంచ్ లద్ద ప్రీతి రూ.500 జరిమానా విధించారు. ఈ సందర్భంగా సర్పంచ్ ప్రీతి మాట్లాడుతూ చెట్లను నాటాలని ప్రభుత్వం ఎంత చెబుతున్నప్పటికీ మొక్కలను నరకడం సరికాదని అన్నారు. ఖాళీ ప్రదేశాల్లో మొక్కలను విరివిగా నాటాలని, గ్రామ ప్రగతికై గ్రామస్తుల సమష్టి కృషి అవసరమని తెలిపారు.

57
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...