మంత్రి హరీశ్‌రావుకు ఘన స్వాగతం


Tue,September 10, 2019 11:39 PM

సిద్దిపేట ప్రతినిధి, నమస్తే తెలంగాణ/ కలెక్టరేట్‌ : ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు పదవీ ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం తొలిసారిగా సిద్దిపేటకు మంగళవారం రాత్రి రావడంతో టీఆర్‌ఎస్‌ నేతలు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధు లు ఘనస్వాగతం పలికారు. హైదరాబాద్‌ నుంచి నేరు గా సిద్దిపేటకు చేరుకున్నారు. సిద్దిపేటలో ఆయన నివా సం వద్ద మంత్రి హరీశ్‌రావుకు మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు. ఎమ్మెల్యే రామలింగారెడ్డి, సీపీ జోయల్‌ డెవిస్‌, పోలీస్‌ ఉన్నతాధికారులు, జడ్పీ చైర్‌పర్సన్‌ రోజాశర్మ, ఉద్యోగ సంఘాల నేతలు మంత్రి ని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మంత్రి హరీశ్‌రావు.. పట్టణంలో పలు మండపాల్లోని గణపతులను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.

91
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...