భక్తి శ్రద్ధలతో మొహర్రం


Tue,September 10, 2019 11:38 PM

హత్నూర: మొహర్రాన్ని మండలంలోని పలు గ్రామాల్లో ప్రజలు కులమతాలకతీతంగా మంగళవారం నిర్వహించారు. హత్నూర, దౌల్తాబాద్‌, సిరిపుర, చింతల్‌చెరు, కాసాల, దేవులపల్లి తదితర గ్రామాల్లో పీర్లను ఉదయం, సాయంత్రం గ్రామాల్లోని ప్రధాన వీధులగుండా ఊరేగించారు. మొహర్రం సందర్భంగా ముస్లింలు పీర్లలకు ప్రార్థనలు చేశారు.
మునిపల్లిలో..
మునిపల్లి: మండలంలోని గ్రామాల్లో మొహర్రాన్ని మంగళవారం ప్రజలు నిర్వహించారు. అందంగా ముస్తాబు చేసిన పీర్లను గ్రామ ప్రధాన వీధుల్లో ఊరేగించగా మహిళలు పీర్లకు నీళ్లతో సాకపెట్టి మొక్కులు తీర్చుకున్నారు. కార్యక్రమంలో ఆయా పార్టీల నాయకులు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, ప్రజలు పాల్గొన్నారు.
పుల్కల్‌లో..
పుల్కల్‌: మండల పరిధిలో మొహర్రం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. మంగళవారం మధ్యాహ్నం పీర్లను వాడవాడల్లో ఊరేగింపు నిర్వహించి గ్రామ కూడలీల్లో ప్రతిష్టించి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. చౌటకూర్‌, శివ్వంపేట, గొంగ్లూర్‌, పుల్కల్‌, సింగూర్‌ తదితర గ్రామాల్లో మొహర్రాన్ని నిర్వహించారు.

36
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...