వ్యవసాయ రంగానికే మంచి భవిష్యత్తు


Tue,September 10, 2019 11:37 PM

కౌడిపల్లి: రామానాయుడు వ్యవసాయ కళాశాలలో విద్యనభ్యసించిన విద్యార్థులు గ్రామాల్లోకి వెల్లిన తరువాత రైతులకు తాము నేర్చుకున్న అంశాలను క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలని ప్రముఖ పాత్రికేయుడు వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. మంగళవారం మండల పరిధిలోని తునికి గ్రామ శివారులోని రామానాయుడు విజ్ఞానజ్యోతి గ్రామీణాభివృద్ధి బేయర్‌ వ్యవసాయ కళాశాలలో 6నెలల కోర్సును పూర్తి చేసుకున్న పాలిటెక్నిక్‌ విద్యార్థులు, 21వ స్నాతకోత్సవం కళాశాల ప్రిన్సిపాల్‌ అర్జున్‌రావు అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ప్రముఖ పాత్రికేయుడు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రసాయన ఎరువుల వాడకం వల్ల భూసారం పూర్తి స్థాయిల్లో తగ్గిపోయిందన్నారు. సమాజానికి మంచి ఆహారాన్ని అందించాలంటే సేంద్రియ ఎరువులతోనే పంటలను పండించాలన్నారు. వ్యవసాయ రంగానికి భవిష్యత్తులో మంచి రోజులు ఉన్నాయన్నారు. వ్యవసాయంతో పాటు డైరీఫాంలను ఏర్పాటు చేసుకుని అధిక రాబడులు పొందవచ్చన్నారు. పాడిపరిశ్రమపై రైతులు తమ ఆలోచన విధానాన్ని పెంచుకోవాలన్నారు. అనంతరం ప్రముఖ సినీ నిర్మాత దగ్గుపాటి సురేశ్‌బాబు మాట్లాడుతూ రామానాయుడు విజ్ఞానజ్యోతి వ్యవసాయ కళాశాల దేశంలో నెంబర్‌ వన్‌ కావాలన్నదే లక్ష్యమన్నారు. మా తండ్రి రామానాయుడు గారి కలను నెరవేర్చాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. రామానాయుడు వ్యవసాయ యూనివర్సిటీ కావాలన్నదే నా లక్ష్యమన్నారు. అనంతరం పాలిటెక్నిక్‌ కోర్సును పూర్తి చేసుకున్న 29మంది విద్యార్థులకు పట్టా సర్టిఫికెట్లతో పాటు మెడల్స్‌ను అందజేశారు. ఈ కార్యక్రమంలో విజ్ఞాన జ్యోతి చైర్మన్‌ డి యన్‌ రావు, ప్రధాన కార్యదర్శి హరిశ్చంద్రప్రసాద్‌, సలహదారులు అచ్యుతరాంప్రసాద్‌, కోడెల శివప్రసాద్‌, బేయర్‌ క్రాప్‌ సైన్స్‌ ప్రతినిధులు సుహస్‌ జోష్‌, ఆనంద, శాస్త్రవేత్త శ్యాంసుందర్‌రావులతో పాటు అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

43
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...