అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలి


Tue,September 10, 2019 11:36 PM

తూప్రాన్‌ రూరల్‌: ప్రజా ప్రతినిధులు, అధికారులు గ్రామ సేవకులుగా పనిచేసినప్పుడే గ్రామాలు సత్వర అభివృద్ధిని సాధిస్తాయని మాజీ ఫుడ్స్‌ చైర్మన్‌ ఎలక్షన్‌రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్‌ అంకుఠిత దీక్షతో 30 రోజుల గ్రామ ప్రణాళిక కార్యక్రమాలు చేపట్టారని, అయితే సీఎం కేసీఆర్‌ ఆశయాలకు అనుగుణంగా గ్రామాల్లోని మహిళలు, యువకులు, గ్రామస్తులు స్వచ్ఛందంగా భా గస్వాములై విజయవంతం చేయాలని ఆ యన పిలుపునిచ్చారు. తూప్రాన్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. శ్రమదానం కార్యక్రమాల ద్వారా గ్రామాలు స్వయం స మృద్ధిని సాధించాలన్నదే సీఎం కేసీఆర్‌ లక్ష్యమన్నారు. ఆయా గ్రామాల ప్రజలు హరితహారం, పచ్చదనం పరిశుభ్రత, ఇం కుడుగుంతల నిర్మాణాలు, వ్యక్తిగత మరుగుదొడ్లు, పరిశుభ్రతపై దృష్టి కేంద్రీకరించాలన్నారు. మారుమూల గ్రామీణ ప్రాంతాలను త్వరితగతిన అభివృద్ధి పథంలో తీసుకెళ్లేందుకు సీఎం కేసీఆర్‌ చూపిస్తున్న చొరవకు ప్రజలు సహకరించి గ్రామాల రూపురేఖలు మార్చుకోవాలన్నారు. ముఖ్యంగా గామాల్లో హరితహారం, పరిశుభ్రత, మురు గు కాల్వలను శుభ్ర పరుచడం, ముండ్ల ్లపొదలను తొలిగించడం, మురుగు కూపాలు లేకుండా దొమలబెడతను నివారించడం, పురాతన బావులను పూడ్చడం తదితర కా ర్యక్రమాలు చేపట్టాలన్నారు. నెల రోజుల్లో గ్రామాల రూపురేఖలు మార్చి చూపించాల్సిన బాధ్యత ప్రజా ప్రతినిధులు, యువకులు, మహిళలదేనన్నారు. మొక్కలు పెం చితే స్వచ్ఛమైన గాలి లభిస్తుందని, పరిశుభ్రతను పాటిస్తే డెంగీ, మలేరియా లాంటి వ్యాధులు రాకుండా ప్రజలు ఆరోగ్యంగా ఉంటారన్నారు. ఈ కార్యక్రమంలో ఏ ఎంసీ వైస్‌ చైర్మన్‌ శ్రీశైలంగౌడ్‌, మల్లారెడ్డి, ఉపేందర్‌,మల్లేశ్‌, నాగయ్యగౌడ్‌తో పాటు టీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు.

45
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...