అంగన్‌వాడీలకు ఆరోగ్యకిట్లు..


Tue,September 10, 2019 04:39 AM

-పలు మందులతో ప్రథమ చికిత్స కిట్లు
-మందుల వాడకంపై పుస్తకం పంపిణీ
-జాగ్రత్తలు తప్పనిసరి..

వెల్దుర్తి : అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చే చిన్నారుల ఆరోగ్యానికి భరోసానిస్తూ ప్రభుత్వం మెడికల్ కిట్లను అందజేస్తున్నది. చిన్నారులను పలు ఆరోగ్య సమస్యలు వేధిస్తుంటాయి. ఇందులో ముఖ్యంగా తరుచూ వేధించేవి జలుబు, దగ్గులకు మందులు, ఆడుకునే సమయంలో తగిలే దెబ్బలకు ప్రథమ చికిత్సను అంగన్‌వాడీ టీచర్లు వైద్యం అందించేలా ఈ కిట్లను ప్రభుత్వం పంపిణీ చేస్తున్నది. గతంలో చిన్నారులకు జ్వరం, జలుబు, దెబ్బలు తగిలిన వారిని వైద్యుల వద్దకు తీసుకెళ్లి చికిత్సను చేయించేవారు. ప్రతిసారి వైద్యుల వద్దకు వెళ్లాల్సి రావడంతో లుమార్లు ఇబ్బందులు వచ్చేవి. వీటిని అధిగమించడానికి అంగన్‌వాడీ టీచర్లే ప్రాథమిక వైద్యం చేసేలా వారికి మెడికల్ కిట్లను ప్రభుత్వం సరఫరా చేస్తున్నది. ఈ కిట్‌లో పది రకాల ప్రథమ చికిత్సలు అందించే మందులు ఉంటాయి. ఏ అనారోగ్యానికి ఏ మందు వాడాలి, ఎంత మోతాదులో మందులను వేయాలి, ఎలా ప్రథమ చికిత్స అందించాలో వివరిస్తూ పుస్తకాలను సైతం కిట్‌తో పాటు అందించారు.

దీంతో అంగన్‌వాడీ టీచర్లకు ప్రాథమిక వైద్యం అందించడానికి సులభంగా మారింది. గతంలోలాగా ఇతర వైద్యుల వద్దకు వెళ్లే పని లేకుండా అంగన్‌వాడీలే చిన్నారులకు ప్రథమ చికిత్సను అందిస్తున్నారు. అంగన్‌వాడీలను పటిష్టం చేసే లక్ష్యంతో తెలంగాణ సర్కార్ ఇప్పటికే ఎన్నో సంస్కరణలను చేపట్టింది. ఇందులో ముఖ్యంగా ఆంగ్ల విద్యాబోధన, చిన్నారులతో పాటు గర్భిణులు, బాలింతలకు ఉడకబెట్టిన గుడ్డు, పాలతో పాటు పౌష్టికాహారాన్ని అందించడం, చిన్నారులను ఆకట్టుకునేలా పలు రకాల బొమ్మలు, చార్ట్‌లను అందించడం జరిగింది. వీటితో పాటు చిన్నారుల బరువు, వారి పొడవులను లెక్కించడం కోసం ఆధునిక పరికరాలను సైతం ప్రభుత్వం అందిస్తున్నది. అలాగే ఇప్పుడు అందిస్తున్న మెడికల్ కిట్లతో అంగన్‌వాడీ కేంద్రాలు మరింత బలోపేతం కానున్నాయి. చిన్నారుల ఆరోగ్యంపై అవగాహనకు వస్తున్న అంగన్‌వాడీ టీచర్లు బాలింతలకు సైతం వాటిని వివరిస్తూ అవగాహన కల్పిస్తున్నారు.

మెడికల్ కిట్‌లో ఉండే మందులు..
అంగన్‌వాడీ కేంద్రాలకు ప్రభుత్వం అందిస్తున్న మెడికల్ కిట్‌లో పారసిటమల్ 500 ఎంజీ మందులు, పారసిటమల్ సిరప్, అయోడిన్ యాంటిమెంట్, దూది, కాటన్ బాండేజి, జింక్ మందులు, యాంటి బయోటిక్ మందులు, మెటెండోజల్ వంటి ప్రథమ చికిత్స మందులు ఉంటాయి.

70
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...