ఎస్సీ నిరుద్యోగ యువతకు..స్వయం ఉపాధి శిక్షణ కోర్సులు


Tue,September 10, 2019 04:37 AM

మెదక్ కలెక్టరేట్ : మెదక్ జిల్లాలోని అర్హులైన ఎస్సీ నిరుద్యోగ యువతకు వివిధ కోర్సులలో 3డీ డైమెన్షన్ ఐటీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్‌లో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఉచిత నైపుణ్య శిక్షణ ఇవ్వనున్నట్లు ఎస్సీ కార్పొరేషన్ ఈడీ దేవయ్య ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని ఆసక్తి గల షెడ్యూల్డు కులాలకు చెందిన యువతీయువకులు ట్రైనింగ్ ఆన్ టాలీ ఈఆర్‌పీ 9, జీఎస్‌టీపై 45 రోజుల శిక్షణ, ఇవ్వనున్నట్లు తెలిపారు. శిక్షణ ముగిసిన తర్వాత ప్రైవేట్ సంస్థలలో ఉద్యోగం ఇప్పించనున్నట్లు తెలిపారు. ఇందుకోసం బీకాం, ఎంకాం, ఎంబీఏ చదివినవారు అర్హులు అన్నారు. శిక్షణకు ఎంపికైన వారికి 90 రోజుల పాటు ఉచిత వసతి, బోజన సదుపాయం కల్పించనున్నట్లు తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు పూర్తి వివరాలతో మీ సేవ ద్వారా పొందిన ఆదాయ, కుల, నివాస ధ్రువపత్రాలతో ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయంలో ఈ నెల 16వ తేదీలోగా అందజేయాలన్నారు. గ్రామీణ ప్రాంతాల వారికి వార్షిక ఆదాయం రూ.1.5లక్షల లోపు పట్టణ ప్రాంతాల వారికి రూ.2లక్షల లోపు వార్షిక ఆదాయం ఉండాలన్నారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని ఒక ప్రకటనలో కోరారు.

51
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...