ఖాజీపల్లి గోశాలలో గోసేవ


Tue,September 10, 2019 04:37 AM

మెదక్ రూరల్ : మెదక్ మండలం ఖాజీపల్లిలోని గోశాలలో మెదక్ వాసవీక్లబ్, వనితక్లబ్ ఆధ్వర్యంలో గోసేవ కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. అంతేకాకుండా మెదక్ పట్టణంలోని సరస్వతీ శిశుమందిర్‌లో చిన్నారులకు నోట్ పుస్తకాలు, పేదలకు బియ్యం పంపిణీ చేశారు. మండల పరిధిలోని తిమ్మానగర్ ప్రభుత్వ పాఠశాలకు టీవీ పంపిణీ చేయడం జరిగిందని వాసవీక్లబ్ జిల్లా గవర్నర్ కాపర్తి శ్రీనివాస్, కోశాధికారి రామారావులు తెలిపారు. కార్యక్రమంలో వాసవీక్లబ్ అధ్యక్షులు హరిప్రసాద్, కార్యదర్శి కృష్ణమూర్తి, కోశాధికారి వెంకటేశ్, గంజి శ్రీనివాస్, రాధాకృష్ణ, వనిత అధ్యక్షురాలు ఉమ, కార్యదర్శి నీలిమ, కోశాధికారి బుచ్చమ్మ, ఇంటర్నేషన్ కో-ఆర్డినేటర్ శివరామకృష్ణ, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ రాగి అశోక్, సభ్యులు కొండ శ్రీను, సకిలం శ్రీను పాల్గొన్నారు.

45
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...