సమస్యల పరిష్కారం కోసమే ప్రజావాణి


Tue,September 10, 2019 04:37 AM

మెదక్ మున్సిపాలిటీ : ప్రజల సమస్యల పరిష్కారం కోసమే ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని జిల్లా అదనపు ఎస్పీ నాగరాజు అన్నారు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫిర్యాదుదారులకు చట్టపరమైన విషయంలో న్యాయం జరగకపోతే ఫిర్యాదుదారులు తిరిగి తమను సంప్రదించాలని తెలిపారు. జిల్లా నలుమూలల నుంచి పలు ఫిర్యాదులు వచ్చాయన్నారు.

-చేగుంట మండలం చిన్నశివనూర్ గ్రామానికి చెందిన గొంది రాంచంద్రయ్య తన భార్య బాగాలేనందున తన 306 గజాల భూమిని తన గ్రామస్తుడైన కంసాని రాంచంద్రారెడ్డికి అమ్మాడు. తన భార్య ఆరోగ్యం బాగాలేనందున తన భార్య వెంబడి దవాఖానలో తిరుగుతూ ఉండగా కంసాని రాంచంద్రారెడ్డి 306 గజాలకు బదులుగా 602 గజాల భూమిని ఆక్రమించుకొని ఇల్లు కట్టుకున్నాడని ఎందుకిలా చేస్తున్నారని అడుగగా రాంచంద్రారెడ్డి కుమారులు మాధవరెడ్డి, రవీందర్‌రెడ్డిలు దాడికి దిగి కొట్టారని ఏఎస్పీకి ఫిర్యాదు చేశారు.
-హవేళిఘనపూర్ మండలం గంగాపూర్ గ్రామానికి చెందిన రేవోజీ స్వాతి తనకు వీరాపురం గ్రామానికి చెందిన శ్రీనుతో 3 సంవత్సరాల క్రితం పెండ్లి జరిగిందని, అయితే పెండ్లి జరిగిన నాటి నుంచి తన భర్త శ్రీను, అత్తమామ రేవోజీ కనకయ్య, ఆడ పడుచు శ్రీవాణి, తన భర్త అన్న రమేశ్‌లు అదనపు కట్నం కావాలని ప్రతి రోజూ మానసికంగా శారీరకంగా వేధిస్తున్నారు. గతంలో చాలా సార్లు పెద్దల సమక్షంలో పంచాయతీ కూడా నిర్వహించడం జరిగింది. అయినా కూడా వారు అదే విధంగా అదనపు కట్నం కోసం వేధిస్తున్నారని, కావున తగిన చర్యలు తీసుకుని, న్యాయం చేయాలని ఏఎస్పీకి ఫిర్యాదు చేశారు.

39
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...