ఎరువులకు ఎలాంటి ఇబ్బందుల్లేవు


Tue,September 10, 2019 04:37 AM

రామాయంపేట : వానాకాలం సీజన్‌లో రైతులకు ఎరువుల వల్ల ఎలాంటి ఇబ్బందులు లేవని జిల్లావ్యాప్తంగా అన్ని సొసైటీలలో ఇఫ్కో ఎరువుల విక్రయాలు జరుగుతు న్నాయని ఇఫ్కో డైరెక్టర్, కోనాపూర్ సొసైటీ చైర్మన్ మాధవరెడ్డిగారి దేవేందర్‌రెడ్డి అన్నారు. సోమవారం రామాయంపేట మండలం ఝాన్సీలింగాపూర్ గ్రామానికి చెందిన రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు ఆధ్వర్యంలో దేవేందర్‌రెడ్డిని ఆయన స్వగృహంలో కలిశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వానాకాలం సీజన్‌లో రైతులకు ఇబ్బందులు తల్లెత్తకుండా జిల్లావ్యాప్తంగా అన్ని సొసైటీలలో ఇఫ్కో ఎరువులతోపాటు ఇతర కంపనీల ఎరువులు కూడా సిద్ధంగా ఉంచామని అన్నారు. ఇప్పటికే వేలాది టన్నుల ఎరువులను సరఫరా చేయడం జరిగిందన్నారు. రైతులకు ఎరువుల వల్ల ఎక్కడైనా ఇబ్బందులు తలెత్తితే జిల్లాలో ఎక్కడ స్టాకు ఉన్నా అక్కడి నుంచి ఎరువులను అందిస్తున్నామని అన్నారు.

జిల్లాలోని కోనాపూర్ సొసైటీలో 120 టన్నుల ఇఫ్కో ఎరువులను విక్రయాలు జరిపినట్లు తెలిపారు. కోనాపైర్ సొసైటీలో రామాయంపేట, నిజాంపేట మండలాల రైతులకు ఎరువులను అందజేస్తున్నామని అన్నారు. త్వరలోనే అన్ని గ్రామాల్లోని సొసైటీ కేంద్రాల్లో కూడా ఎరువులను అందించేలా చర్యలను చేపడుతున్నామని పేర్కొన్నారు. అదునుకు వానలు రానందున రైతులు వరిసాగు చేయలేక పోయారని అన్నారు. వర్షాలు రావడంతోనే వరి వేయడంతో కొంత సమయం పట్టిందన్నారు. అయినా కూడా ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు జరుగకుండా చూస్తున్నామని అన్నారు. ఆయన వెంట నర్సారెడ్డి, సీఈవో గోపాల్‌రెడ్డి, చంద్రశేఖర్, మల్లారెడ్డి తదితరులు ఉన్నారు.

45
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...