హ్యాండ్‌బాల్‌ ఉమ్మడి జిల్లా జట్ల ఎంపిక


Sun,September 8, 2019 11:53 PM

సంగారెడ్డి టౌన్‌ : 36వ తెలంగాణ రాష్ట్ర సబ్‌ జూనియర్స్‌ బాలురు, బాలికల హ్యాండ్‌ బాల్‌ ఉమ్మడి మెదక్‌ జిల్లా జట్లను ఎంపిక చేశారు. ఆదివారం ఉమ్మడి మెదక్‌ జిల్లా హ్యాండ్‌ బాల్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో సంగారెడ్డిలోని అంబేద్కర్‌ క్రీడా మైదానంలో ఎంపిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ఎంపికకు ఉమ్మడి జిల్లా నుంచి 70 మంది బాలబాలికలు హాజరయ్యారు. అందులో 16 మంది బాలికలు, 16 మంది బాలురతో రెండు జట్లను ఎంపిక చేశారు. ఈ ఎంపిక కార్యక్రమానికి సం గారెడ్డి రూరల్‌ సీఐ శివకుమార్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 14వ తేదీ నుంచి 17వ తేదీ వర కు వరంగల్‌ జరుగబోయే సబ్‌ జూనియర్స్‌ బా లురు, బాలికలు విజయం సాధించి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలన్నారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి కె.విజయ్‌బాబు, ఆర్గనైజింగ్‌ సెక్రెటరీ కె.మహేశ్‌, సెలక్షన్‌ కమిటీ మెంబర్స్‌ ఎస్‌. తేజేందర్‌ సింగ్‌, కె.శ్రీకాంత్‌, క్రీడాకారులు పాల్గొన్నారు.

రాష్ట్ర స్థాయి పోటీలకు విద్యార్థుల ఎంపిక..
అందోల్‌, నమస్తే తెలంగాణ: అందోల్‌ మండలం కంసాన్‌పల్లి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైనట్లు ప్రధానోపాధ్యాయు డు కృష్ణ, గైడ్‌ ఉపాధ్యాయుడు సిద్ధేశ్వర్‌ తెలిపారు. ఇటీవల జిల్లా స్థాయిలో నిర్వహించిన జాతీయ బాలల సైన్స్‌ కాంగ్రెస్‌ పోటీల్లో పాఠశాలకు చెందిన కృష్ణ, ప్రవీణ్‌ తయారు చేసిన సేవ్‌వాటర్‌, సేవ్‌లైఫ్‌ అనే ప్రదర్శనను జిల్లా స్థాయి అధికారులు రాష్ట్ర స్థాయికి ఎంపిక చేసినట్లు తెలిపారు. కాగా విద్యార్థులు చేసిన ప్రదర్శన రాష్ట్ర స్థాయికి ఎంపిక కావడంతో అధ్యాపక బృందం విద్యార్థులను అభినందించారు.

క్రీడలతోనే మానసికోల్లాసం..
పుల్కల్‌: క్రీడల వల్ల విద్యార్థుల్లో మానసికోల్లాసం కలుగుతుందని సింగూర్‌ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్‌ తిరుపతయ్య తెలిపారు. ఆదివారం గురుకుల పాఠశాల ఆవరణలో ఉమ్మడి మెదక్‌ జిల్లా సాంఘిక సంక్షేమ పాఠశాలల జిల్లా స్థాయి క్రీడలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల్లో క్రీడల ద్వారా పోటీతత్వం ఏర్పడి లక్షసాధనలో ముందుంటారని తెలిపారు. ఏటా గురుకుల పాఠశాలలో క్రీడలు నిర్వహిస్తూ విద్యార్థుల్లో మానసిక ైస్థెర్యం నింపుతున్నామని పేర్కొన్నారు. ఈ క్రీడల్లో ఉమ్మడి మెదక్‌ జిల్లా నుంచి ఆరు గురుకుల కళాశాలలు, 11 గురుకుల పాఠశాలల నుంచి 430 మంది విద్యార్థులు పాల్గొన్నారు. వాలీబాల్‌ అండర్‌-17లో 11 టీంలు, అండర్‌ 19-విభాగంలో 16 టీంలు పాల్గొన్నాయి. ఖోఖోలో అండర్‌-14 లో 11 టీంలు, అండర్‌-17లో 11 టీంలు, అండర్‌-19 లో 6 టీంలు పాల్గొన్నాయని క్రీడాధికారి గణపతి తెలిపారు. అదేవిధంగా జిల్లా కబడ్డీ జట్టును కూడా ఎంపిక చేశారు.

41
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...