పర్యాటకుల తాకిడి


Sun,September 8, 2019 11:53 PM

హవేళిఘణపూర్‌: పోచారం అభయారణ్యం.. నిండుకుండలా ఉన్న పోచారం డ్యామ్‌ను చూసేందుకు జిల్లాతో పాటు నిమాజాబాద్‌, హైదరాబాద్‌ తదితర ప్రాంతాల నుంచి పర్యాటకులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు పోచారం డ్యామ్‌ పొంగిపొర్లుతుండడంతో ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన పర్యాటకులు డ్యామ్‌ అలుగు వద్ద స్నానాలు చేస్తూ సెల్ఫీలు దిగుతూ సరదాగా గడిపారు. ఈ ప్రాంతానికి ఆయా ప్రాంతాలకు చెందిన కుటుంబసభ్యులతో తరలివచ్చి చెట్ల కింద సేదదీరారు. ముఖ్యంగా ఆదివారం సెలవు దినం కావడంతో రద్దీ విపరీతంగా పెరిగింది. పోచారం అభయారణ్యంలో ఉన్న పార్కుకు పర్యాటకులు వచ్చి సాయంత్రం వరకు కుటుంబ సభ్యులతో గడిపారు. పోచారం అభయారణ్యంలో ఉన్న జంతువులను చూసేందుకు అటవీ శాఖ అధికారులు అవకాశం కల్పించారు. పోచారానికి వచ్చే పర్యాటకులు కోసం వివిధ రకాల తినుబండాల దుకాణాలు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా హవేళిఘనపూర్‌ ఎస్‌ఐ శ్రీకాంత్‌ ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు.

59
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...