జిల్లాకు సరిపడా యూరియా


Sun,September 8, 2019 11:53 PM

-కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నాం..
-1200 మెట్రిక్‌ టన్నుల యూరియాను రైతులకు అందించాం
-రెండు రోజుల్లో 1000 మెట్రిక్‌ టన్నుల యూరియా జిల్లాకు రాక
-ఏవోల పర్యవేక్షణలో పంపిణీకి చర్యలు
-జిల్లా వ్యవసాయశాఖ అధికారి పరశురాంనాయక్‌
మెదక్‌ ప్రతినిధి, నమస్తేతెలంగాణ: ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాలకు అనుగుణంగా జిల్లాకు యూరియా కొరత లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి పరశురాంనాయక్‌ తెలిపారు. ఆదివారం వరకు1200 మెట్రిక్‌ టన్నుల యూరియాను పంపిణీ చేసినట్లు వివరించారు. జిల్లా వ్యాప్తంగా 38 సహకార సంఘాల ద్వారా రైతులకు యూరియాను అందిస్తున్నామన్నారు. ఆదివారం అయినప్పటికీ మండల వ్యవసాయశాఖ అధికారుల పర్యవేక్షణలో యూరియాను పంపిణీ చేస్తున్నామన్నారు. రైతులు యూరియా విషయంలో ఎలాంటి ఆందోళన చెందవద్దని మరో రెండు రోజుల్లో 1000మెట్రిక్‌ టన్నుల యూరియా జిల్లాకు రానుందని వెల్లడించారు. రైతులకు యూరియా అందించేందుకు ఎప్పటికప్పుడు అధికారులతో చర్చించి యూరియా కొరతలేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ప్రణాళిక బద్దంగా జిల్లాకు యూరియాను తెప్పిస్తున్నట్లు చెప్పారు. మొత్తం జిల్లాకు ఈ వ్యవసాయ సీజన్‌కు సరిపడా యూరియాను తెప్పించి త్వరలో జిల్లా కోటా మొత్తం తెప్పించి రైతులకు సరఫరా చేస్తామన్నారు. ఇదిలా వుండగా వ్యవసాయ శాఖ ఏవోల పర్యవేక్షణలో ప్రాథమిక సహకార సంఘాల నుంచి రైతులకు యూరియాను పంపిణీ చేశారు.

46
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...